దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి హన్సిక డిసెంబర్ 4వ తేదీ తాను ప్రేమించిన వ్యక్తి తన బిజినెస్ పార్టనర్ సోహైల్ కతురియ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరి వివాహం రాజస్థాన్ జైపూర్ లోని పురాతనమైనటువంటి ముంటోడా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.ఇలా హన్సికకు సోహైల్ తో తనకిది మొదటి వివాహం కాగా సోహెల్ కి మాత్రం ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.
ఈయన హన్సిక స్నేహితురాలిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన అనంతరం హన్సికను వివాహం చేసుకున్నారు.
ఇకపోతే సోహైల్ తనకు బిజినెస్ పార్ట్నర్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ పెళ్లికి కారణమైంది.
ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడిన ఈ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వీరి వివాహం జరిగింది.ఇక డిసెంబర్ 4వ తేదీ హన్సిక వివాహం జరగగా డిసెంబర్ రెండవ తేదీ నుంచి సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే మూడు రోజులపాటు వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇలా మూడు రోజుల పాటు పురాతన ప్యాలెస్ లో ఈమె వివాహం జరగడంతో ఎంతోమంది ఈమె వివాహానికి భారీగా ఖర్చు చేసే ఉంటారని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే హన్సిక తన వివాహం కోసం ఎంత మొత్తంలో ఖర్చు చేశారనే విషయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే హన్సిక తన పెళ్లి కోసం సుమారు 20 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది.
ఇలా హన్సిక పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.