MP Komatireddy Venkatareddy : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.నేను ఎంపీ అయినా రాజకీయాలకు దూరంగానే ఉన్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

 Mp Komatireddy Venkatareddy Visited Tirumala Sri Venkateswara Swami , Tirumala S-TeluguStop.com

గురువారం ఉదయం కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో‌ పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనంతరం ఆలయ వెలుపల కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.

కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉందన్నారు.గత రెండున్నర సంవత్సరాలుగా దేశాన్ని, రాష్ట్రాన్ని కుదిపేసి, ప్రాణాలను బలిగొన్న రోగాలు రాకుండా ప్రజలను కాపాడాలని ప్రార్ధించినట్లు చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలియజేశారు.

గుజరాత్ ఎన్నికల ఫలితాలు నేను చూడలేదని, దేవుని సన్నిధిలో రాజకీయాలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

కోవిడ్ కారణంగా ఆర్ధిక పరిస్ధితి చిన్నాభిన్నంమైందని, స్వామి వారి ఆశీస్సులతో ప్రజల కష్టాలు అన్ని తొలగి పోవాలని,ఏ పార్టి అధికారంలో ఉన్నా, రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా కష్టపడి ప్రజల కష్టాలను తొలగించాలని ఆయన కోరారు.షర్మిలాను త్రోయింగ్ చేసి తీసుకెళ్లడంను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు.

మహిళా నాయకురాలైన షర్మిలాకు నచ్చజెప్పి తీసుకెళ్ళి ఉండాల్సిందన్నారు.రాజకీయంగా నేను ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పినా ఆయన, ఎంపీ అయినా ప్రస్తుతం రాజకీయాలను నేను దూరంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.

పార్లమెంట్లల్లో అందరి ఎంపీల కంటే ఎక్కువ నిధులు తెచ్చుకున్నది నేనేనని, ప్రస్తుతం నా నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టానని ఆయన తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube