80 Feet Long Strange Object : ఆ బీచ్ దగ్గర 80 అడుగుల పొడవు వున్న వింత వస్తువు... చూడడానికి తరలివెళ్తున్న జనాలు!

ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరితరమూ కాదు.ముఖ్యంగా ఫారిన్ కంట్రీలలో ఇలాంటి వింతలూ విశేషాలు అనేవి ఎక్కువగా చోటుచేసుకుంటాయి.తాజాగా అమెరికాలో ఓ బీచ్ వద్ద 80 అడుగుల (24.3 మీటర్ల) పొడువు ఉన్న ఓ గుర్తు తెలియని వింత వస్తువు కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యంలో మునిగి తేలిపోయారు.ఈ ఘటన ఫ్లోరిడాలోని వోలుసియా కౌంటీలో జరిగింది.అక్కడికి దగ్గరలో వున్నా డేటోనా బీచ్ ఒడ్డున ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం.కాగా ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టమైన సంకేతాలు తెలియరాలేదు.

 80 Feet Long Strange Object Near The Beach People Are Moving To See It , Beach,-TeluguStop.com

ఇకపోతే సదరు వస్తువు చెక్కతో పాటు మరో తెలియని ఓ లోహంతో నిర్మితమై ఉందని కొందరు పురావస్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మొదట ఈ విషయాన్ని బీచ్ కి వెళ్లిన కొందరు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు.కాగా ఆ వస్తువును గతంలో ఇసుకలో పాతిపెట్టగా అది గత నెల సంభవించిన హరీకేన్ నికోల్ వల్ల బయటకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

కాగా ఆ వస్తువు ఏమై ఉంటుందన్న విషయాన్ని ప్రస్తుతం తేల్చలేకున్నారు.

Telugu America, Beach, Florida, Latest, Volusia County-Latest News - Telugu

కాగా ఆ వస్తువుకు సంబంధించి పలు సిద్ధాంతాల ఆధారంగా పరిశోధకులు కొన్ని విషయాలు అంచనా వేస్తున్నారు.చాలా మంది అధికారులు మాత్రం అది నేషనల్ అసోసియేషన్ ఫర్ స్టాక్ కార్ ఆటో రేసింగ్ కు సంబంధించిన వస్తువని ఊహాగానాలు చేస్తున్నారు.మరికొందరు అది పురాతన ఓడ శకలాలకు సంబంధించిందని, సాగర తీరం కోతకు గురి కావడం వంటి పరిణామాల వల్ల అది బయటపడిందని చెబుతున్నారు.

ఈ విషయం ఈనోటా ఆనోటా తెలిసి మీడియాకి చిక్కడంతో ఆ వస్తువుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube