హోటల్ లో ఇడ్లీ సాంబర్ తింటున్న సమయంలో బల్లి కనిపించడంతో కలకలం చెలరేగింది.ఈ ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది.
సంజీవనగర్ టూరిస్ట్ హోటల్ లో టిఫిన్ చేస్తున్న ఓ వ్యక్తికి తింటున్న ఇడ్లీలో బల్లి కనిపించింది.ఇదేమిటనీ ప్రశ్నించగా చిన్న బల్లి పడింది ఏమీ కాదంటూ హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలుస్తోంది.
హోటల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనంతరం టూరిస్ట్ హోటల్ వద్ద కస్టమర్లు ఆందోళనకు దిగారు.
ఫుడ్ ఇన్ స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదని మండిపడ్డారు.