దిగ్గజ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ గురించి తెలియని వారు ఉండరు.ఈ రియల్ లైఫ్ హీరో కొడితే గోడ పగిలిపోతుంది.
చెక్కలూ విరిగిపోతాయి.మనుషులు అంత ఎత్తు పైకి ఎగిరి పడిపోతుంటారు.
సాధారణంగా ఇలాంటి దృశ్యాలు సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది.కానీ బ్రూస్ లీ ఇందుకు విభిన్నం.
సినిమాల్లో చూపించే దానికంటే ఎక్కువ పవర్‌ఫుల్ పర్సన్ ఇతడు.ఇతడి ఫైటింగ్ మూవీస్ కెమెరాలకు కూడా చిక్కవు.
అంత ఫాస్ట్ అతడు.అందుకే ప్రపంచంలో ఏం మార్షల్ ఆర్టిస్ట్‌కి రాని పేరు ఒక్క బ్రూస్ లీకే వచ్చింది.
ఈ భూ ప్రపంచం ఉన్నంతవరకు అతడి చరిత్ర గొప్పతనం ఎప్పటికీ సజీవంగానే ఉంటుందనడంలో సందేహం లేదు.
బ్రూస్ లీ నవంబర్ 27, 1940లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు.
హాంకాంగ్‌కి వెళ్లిన తర్వాత అక్కడ కరాటే నేర్చుకున్నాడు.కొంతకాలంలోనే అసాధారణమైన మార్షల్ ఆర్టిస్టుగా పేరొందాడు.
సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు.బతికిందే 32 ఏళ్ళే కానీ అతడి ప్రభావం వందల ఏళ్ల వరకు ప్రజలపై ఉంటుందని చెప్పచ్చు.
బ్రూస్‌లీ బతుకున్న సాధారణ మనుషులకి సాధ్యం కానీ చాలా ఫీట్స్ చేసేవాడు.బొటనవేలుపై పుష్అప్స్ చేయడం, ఇంకా ఒక్క అంగుళం దూరం నుంచి పవర్ ఫుల్ పంచ్ ఇచ్చి అవతలి వ్యక్తిని పడేయడం వంటి చాలా ఫీట్స్ అతడికొక్కడిక్కే సాధ్యమయ్యేవి.
ఒక అంగుళం దూరం నుంచి పడేయడాన్ని వన్ ఇంచ్ పంచుగా అభివర్ణిస్తుంటారు.
ఈ పంచ్‌ను టెక్నిక్‌తో విసరాల్సి ఉంటుంది.చాలా దూరం నుంచి గట్టిగా బలంగా గుద్దినా పడని ప్రభావం ఈ వన్ పంచ్ తో పడుతుందని చెప్పవచ్చు.ఈ టెక్నిక్ నేర్చుకోవడం అందరి వల్ల సాధ్యం కాదు.
కాగా బ్రూస్లీ దీనిని చాలా అద్భుతంగా నేర్చుకొని చాలామందిని నేలకుర్చాడు.ఈ పంచ్‌లో కండరాల శక్తి కంటే, మనుసులో నుంచి వచ్చే శక్తి చాలా కీలకంగా మారుతుందని అంటుంటారు.
బ్రూస్ లీ పిడికిలి గుద్దు మిల్లీ సెకన్ల సమయంలో ఇంచు మాత్రమే ముందుకు కదులుతుంది.ఈ సమయంలోనే అతడు తన పూర్తి శరీరాన్ని కదిలించి శక్తి మొత్తం చేతి వద్దకి ఒక మెరుపులా వచ్చేటట్లు చేస్తాడు.
ఈ పంచ్ విసిరేటప్పుడు బ్రూస్ లీ తన లెగ్స్ నుంచి బ్రెయిన్ వరకు అన్ని శక్తులను తన పిడికిలికి తీసుకొస్తాడు.బాగా శక్తి వచ్చేందుకు తన తుంటి కండరాలను చాలా వేగంగా కదిలిస్తాడు.
మొత్తం మీద బాడీని ఒక క్రమ పద్ధతిలో కదిలిస్తూ తన పిడికిలికి ఒక ఏనుగు అంత శక్తిని తీసుకొస్తాడు.ఫిజియో శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని కనుగొన్నారు.
ఏదేమైనా బ్రూస్లీ ఒక లెజెండ్.అలాంటివారు కోటికో నూటికో ఒక్కరు పుడతారని అనడంలో అతిశయోక్తి లేదు.