బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే.బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎంతో కష్టపడుతున్నా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు.
అయితే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ టబు తాజాగా షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీని టబు కాపాడిందని కంగనా రనౌత్ చెప్పుకొచ్చారు.
టబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న నేపథ్యంలో కంగనా రనౌత్ ఈ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.టబు నటించిన భూల్ భూలయ్యా2, దృశ్యం2 సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో కంగనా ఈ కామెంట్లు చేశారు.
అయితే కంగనా చేసిన కామెంట్ల విషయంలో టబు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.ఒక సెంటిమెంట్ ప్రకారం కంగనా చేసిన కామెంట్లు నిజమేనని మరి కొందరు చెబుతున్నారు.
భూల్ భూలయ్యా2 సినిమా 250 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోగా దృశ్యం2 కేవలం 4 రోజుల్లో 75 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను అందుకుంది.దృశ్యం మూవీ హిందీలో కూడా అంచనాలకు మించి సక్సెస్ సాధించింది.
రాబోయే రోజుల్లో దృశ్యం2 మూవీ మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. దృశ్యం2 సక్సెస్ తో బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం జోష్ లో ఉంది.

దృశ్యం2 భారీ సక్సెస్ నేపథ్యంలో త్వరలో దృశ్యం3 దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది.దృశ్యం3 సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంది.దృశ్యం3 సినిమానే ఈ సిరీస్ లో చివరి సినిమా కానుంది.దృశ్యం3 సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని అంచనాలు ఏర్పడ్డాయి.