టాప్ హీరోయిన్ లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు.ఈమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఈమెకు స్టార్ డమ్ దక్కింది.ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది ఈ బుట్టబొమ్మ.
వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకోవడమే కాకుండా అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు మారుమోగి పోయింది.
అయితే ఇటీవలే ఈమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి మూడు సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యాయి.
దీంతో అమ్మడి జోరు తగ్గిపోయింది అని అంతా అనుకున్నారు.కానీ ఇదే సమయంలో త్రివిక్రమ్ ఆఫర్ ఇచ్చి ఆదుకున్నాడు.మహేష్ బాబు సరసన పూజా హెగ్డే ను సెలెక్ట్ చేసాడు.అయితే ఈ సినిమా షూట్ మాత్రం లేటవుతూ ఉంది.
ఇదిలా ఉండగా ఈ అమ్మడు ఇటీవలే గాయం కారణంగా బెడ్ ఎక్కింది.కాలికి గాయం కారణంగా ఈమె ప్రెజెంట్ రెస్ట్ లో ఉంది.డిసెంబర్ వరకు రెస్ట్ లోనే ఉంటుంది అనికున్న వారికీ ఈమె స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది.
లెగ్ పెయిన్ దాదాపు తగ్గినట్టు ఉందేమో తాజాగా కొత్త ఫోటో షూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఈ అమ్మడు ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేసింది.కేవలం కంటి చూపుతోనే ఎంతో మందిని ఆకట్టుకుంటుంది.
స్కిన్ షోతో మెప్పిస్తూనే ఓర చూపుతో బాణాలు సంధిస్తూ ఫుల్ ఫామ్ లోకి వచ్చానని చెప్పకనే చెప్పింది.దీంతో మహేష్, త్రివిక్రమ్ సినిమాకు లైన్ క్లియర్ అయినట్టే.
ఈ నవంబర్ చివరి కల్లా ఈమె సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.