Governor Tamilisai Soundararajan : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్...

సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామంలో చారిత్రాత్మక బూరుజును సందర్శించి బైరాన్ పల్లి అమరవీరులకు నివాళులర్పించి, స్వాతంత్ర సమరయోధులను సన్మానించిన గౌరవ రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందరరాజన్.ఈ సందర్భంగా భైరాన్ పల్లి గ్రామస్తులు వీర బైరాన్ పల్లి చారిత్రాత్మక స్వతంత్ర పోరాటంలో గ్రామంలోని అన్ని ఇండల్లోని ప్రజలు పాల్గొని తన వారి ప్రాణాలను కోల్పోయారని, కాని గ్రామంలో 20 మందికి మాత్రమే స్వాతంత్ర సమరయోధుల పింఛను వస్తుందని దేశ ప్రధానమంత్రి మోడీ మరియు కేంద్ర హోం శాఖ మంత్రి తో మాట్లాడి ప్రతి ఇంటికి ఒక స్వాతంత్ర సమరయోధుల పింఛను వచ్చేలా చూడాలని, భైరాన్ పల్లి గ్రామంను పర్యాటకంగా అభివృద్ధి చెందేలా చూడాలని గ్రామస్తులు గవర్నర్ ను కోరారు.

 Governor Tamilisai Soundararajan Visited Sri Mallikarjuna Swamy Of Komuravelli A-TeluguStop.com

ఈ సందర్భంగాగౌరవ రాష్ట్ర గవర్నర్ తమిళిఫై కామెంట్స్:-చారిత్రాత్మక వీర బైరాన్ పల్లి ని సందర్శించడం, హైదరాబాద్ స్వాతంత్ర సమర యోధులను సన్మానించడం సంతోషంగా ఉంది.దేశానికి స్వాతంత్రం వచ్చిన కూడా హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు కొనసాగించిన దుశ్చర్యలను వీర బైరాన్ పల్లి వీరులు వీరోచితంగా ఎదుర్కొని తమ ప్రాణాలను అర్పించి హైదరాబాద్ సంస్థానం విముక్తికి బాటలు వేశారు.

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రత్వాల సందర్భంగా రాజ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఈగ్రామ విద్యార్థిని ద్వారా గ్రామ చరిత్రను తెలుసుకున్నాను.

ఆమె విజ్ఞప్తి మేరకు గ్రామాన్ని సందర్శించాను.

గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు అమరవీరుల కుటుంబాలకు స్వాతంత్ర సమరయోధుల పించను ఇప్పించేందుకు కృషి చేస్తాను.హైదరాబాద్ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన వీర బైరాన్ పల్లి చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విద్యార్థులు, యువత బైరాన్ పల్లి అమరత్వం గురించి తెలుసుకోవడం మూలంగా వారిలో దేశభక్తి భావం పెంపొందుతది కాబట్టి గ్రామాన్ని అందరు సందర్శించేలా పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube