TV Channels New Guidelines: ఇరకాటంలో TV ఛానళ్లు.. కొత్త రూల్స్ తో 30 నిమిషాలు ఇవి తప్పవట?

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ వలన టెలివిజన్ ఛానెళ్లు ఇపుడు డిఫెన్స్ లో పడే పరిస్థితి వచ్చింది.ప్రసార మంత్రిత్వ శాఖ, సమాచార శాఖ తాజాగా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనల్లో తాజాగా కొత్త నియమనిబంధనలను పేర్కొంది.

 ఇరకాటంలో Tv ఛానళ్లు.. కొత్త రూల్-TeluguStop.com

విషయం ఏమంటే, ప్రతి రోజూ ఓ 30 నిమిషాల పాటు TV ఛానెళ్లు తప్పకుండా జాతీయాసక్తి, ప్రజా సేవకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిందిగా కమాండ్ చేసాయి.దాంతో టీవీ ఛానళ్లు మొహమాటంలో పడ్డాయి కానీ.

తప్పేటట్టు లేదు.

ఇక్కడ కేంద్రం కొన్ని రకాల టీవీ చానళ్లకు మినహాయింపు ఇచ్చింది.

వాటిలో క్రీడలు, విదేశీ, వన్యప్రాణులకు సంబంధించిన ఛానెళ్లకు ఈ రూల్స్ వర్తించవని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.త్వరలోనే దీనికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అయినటువంటి అపూర్వ చంద్ర ఓ మీడియా వేదికగా తెలుపడం జరిగింది.

న్యూస్ అందించే అన్ని ఛానెళ్లు కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రతీ రోజూ 30 నిమిషాల పాటు జాతీయాసక్తి ఉన్న కంటెంట్ ను ప్రసారం చేయాల్సిందే అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Telugu Latest, Tv Channel, Tv Channels-Latest News - Telugu

ఈ క్రమంలో జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలైనటువంటి విద్య, అక్షరాస్యత, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, జాతీయ సమైక్యత, సాంస్కృతిక వారసత్వం, రక్షణ మొదలగు అంశాల మీద కంటెంట్ ప్రసారం చేసి తీరాలి.రోజులో కనీసం 30 నిమిషాల పాటు ఇటువంటివి ప్రసారం చేయాలని పేర్కోవడం విశేషం.ఇండియాలో ఛానెల్ అప్ లింగ్, డౌన్ లింక్ చేయడానికి అనుమతి ఉన్న అన్ని కార్పొరేట్ ఛానళ్లు కూడా 30 నిమిషాల పాటు ప్రసారం చేయాల్సి ఉంటుంది అని అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube