Tiger hunt :నెమ్మదిగా వేటాడాలని చూసినా పులి.. కానీ చివరికి ఏమైందో మీరే చూడండి..

ఈ భూమి మీద జీవించాలంటే జంతువులన్నీ దాదాపు వాటి ప్రాణాల కోసం ఇతర క్రూర జంతువుల నుంచి ఉన్న ప్రమాదంతో ప్రతిరోజు కూడా పోరాడాల్సిందే.క్రూర జంతువులు వాటికి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జంతువును వేటాడి తినడం మనం డిస్కవరీ చానల్స్ లో ప్రతిరోజు చూస్తూనే ఉంటాం.

 A Tiger Tries To Hunt Slowly.. But See What Happened In The End , Tiger, Hunt,-TeluguStop.com

అలాంటి క్రూర జంతువుల్లో పులి దాని వేటను ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకుని చేస్తుంది.కొన్నిసార్లు పులి ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నా ఒక్కొక్కసారి అది వేటాడాల్సిన జంతువు తప్పించుకుని వెళ్ళిపోతుంది.

అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.అడవి లో ఆకలితో ఉన్న ఒక పులి బ్లూబక్‌ ను చూసి వేటాడాలని ప్లాన్ చేసింది.

ఆ జంతువుపై దాడి చేసే క్రమంలో పులి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అది దాడి చేయాల్సిన జంతువు వైపు కదిలింది.కానీ ఆ నీలి జింక తలెత్తి చూసే సమయానికి కిందకు ఒక్క సారిగా కూర్చుంటూ, దాక్కుంటూ ముందుకు వెళ్ళింది.

చివరికి రెండు సార్లు అలా జరిగిన తర్వాత నీలి జింక పులుని చూసి పరిగెత్తడం మొదలుపెట్టింది.పులి ఎంత జాగ్రత్తగా వేటాడాలనుకున్న ఆ జంతువు తప్పించుకుంది.నీలి జింక ఎలా తప్పించుకుందో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు.

మధ్యప్రదేశ్‌ సాత్పురా నేషనల్‌ పార్క్‌లో ఈ ఘటన జరిగిందని రాజేష్‌ సనాప్‌ అనే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ వీడియోను షేర్ చేశాడు.సోషల్ మీడియాలో వైరల్ అయినా ఈ వీడియోను చూసి చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు.కొంతమంది ఫన్నీగా కామెంట్లు చేస్తే, మరి కొంతమంది కోపంతో ఉన్న ఎమోజీలు పెట్టి కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube