రంగు రంగుల పెయింటింగ్స్ అంటే చాలా మందికి ఇష్టం.అయితే ప్రపంచంలో ఎక్కడ చూసినా, మనకు తెలుపు రంగులోనే విమానాలు కనిపిస్తాయి.
కొన్ని కంపెనీలు తమ ఇష్టానికి తగ్గట్టు కొన్ని రంగుల స్టిక్కర్లు అతికించుకుంటాయి.లేదా కంపెనీ పేరు కనిపించేలా, లోగోలు దర్శనమిచ్చేలా కొంత భాగం మాత్రం వేరే రంగు పెయింటింగ్ వేయిస్తున్నాయి.
మెజారిటీ భాగం మాత్రం తెలుపు రంగులోనే ఉంటాయి.అయితే దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి.
విమానాలను నిరంతరం పాలిష్ మరియు శుభ్రపరచవలసి ఉంటుంది.అందువల్ల వారు తెల్లటి పెయింట్‌కు మారారు.
సూర్యకాంతిని ఉత్తమంగా ప్రతిబింబించే రంగు తెలుపు.క్యాబిన్ తాపనాన్ని తగ్గించడానికి మరియు సౌర వికిరణం నుండి సంభావ్య నష్టాన్ని నివారించడానికి వైట్ పెయింట్ ఉత్తమ మార్గం.
ఈ కారణంతో తెలుపు రంగు వేస్తుంటారు.
మంచు, గాలి, వర్షం మరియు సాధారణ ఉష్ణోగ్రత మార్పులు విమానాల పెయింట్‌ను క్షీణింపజేస్తాయి.
తెలుపు కంటే మిగిలిన రంగులు వేగంగా మసకబారుతాయి.దీని వల్ల ప్రయాణికులకు విమానాలు అందవిహీనంగా కనిపిస్తాయి.
దీంతో కంపెనీలు తమ విమానాలకు భారీగా ఖర్చు పెట్టి, మరలా మరలా పెయింట్ వేయించాల్సి ఉంటుంది.ఈ సమస్యకు పరిష్కారంగా అంతా తెలుపు రంగును వినియోగిస్తున్నారు.
విమానాలకు ఉండే తెలుపు రంగు పక్షుల దాడుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

అంతేకాకుండా తెలుపు రంగు అయితే డ్యామేజ్‌ని గుర్తించడం సులభంగా ఉంటుంది.దీని వల్ల మరమ్మతులు త్వరితంగా చేయొచ్చు.ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడొచ్చు.
ఇంటీరియర్ డెకరేషన్ కోసం సూపర్ మార్కెట్లలో కనిపించే పెయింట్స్ కంటే ఎయిర్‌క్రాఫ్ట్ పెయింట్‌లు చాలా ఖరీదైనవి.బోయింగ్ 737కి 240 లీటర్ల పెయింట్, ఎయిర్‌బస్ A380కి 3,600 లీటర్ల వరకు పెయింట్ అవసరం పడుతుంది.
మిగిలిన రంగులతో పోలిస్తే తెలుపు రంగు తక్కువ బరువు ఉంటుంది.ఈ కారణాల వల్ల విమానయాన కంపెనీలు తెలుపు రంగుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయి.







