భూమిపై ఎన్నో వింతలు జరుగుతుంటాయి.అందులో ఎన్నో వింతలు ఉండగా.
మనిషిని పోలిన మనిషి ఉండటం కూడా మరో వింత అనే చెప్పాలి.ఇప్పటికే ఒక ఇంట్లో పుట్టిన కవల పిల్లలను ఒకే రూపంలో చూస్తుంటాం.
కానీ వేరే వేరే చోట్ల ఒకే రూపంలో ఉన్న వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.ఎవరైనా ఒక వ్యక్తిని మొదటిసారి చూసామో.
ఇదివరకే ఎక్కడో చూసాము అన్నట్టు అనిపిస్తుంది.
ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో కూడా ఒకే రూపంతో ఉన్న కొందరు సెలబ్రెటీలు ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రజినీకాంత్ లాగా పోలిన వ్యక్తి ఫోటో బాగా వైరల్ అవుతుంది.పైగా అతను పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి.దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ రజినీకాంత్ లాగే ఉన్నాడు అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.ఇక పాకిస్తాన్ లో రజినీకాంత్ ఏం చేస్తున్నారు అంటూ సరదాగా కామెంట్లు కూడా పెడుతున్నారు.
ఇంతకు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం.ఇక అతని పేరు రెహ్మాత్ గాస్‌ఖోరి.అతను రజనీకాంత్‌ను పోలి ఉండటంతో పాకిస్థాన్‌లో అందరూ ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతుంటారు.ఇక అతడిని చూసి నిజంగానే రజినీకాంత్ పాకిస్తాన్ కి వచ్చారా అంటూ ఆయన దగ్గరికి వెళ్లి ఫోటోలు దిగటానికి ఎగబడుతుంటారట.
ఆ తర్వాత తను రజినీకాంత్ కాదని చెప్పటంతో అందరూ షాక్ అవుతారని స్వయంగా తానే తెలిపాడు.
ఇక అతను పాకిస్తాన్ గవర్నమెంట్ ఉద్యోగి.పాకిస్తాన్ లో కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగం చేయగా ప్రస్తుతం అతను రిటైర్మెంట్ తీసుకున్నాడు.ఇక ఆయన వయసు 62 ఏళ్లు.
ఇక ఈయన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.ఇక తను రజినీకాంత్ పోలికలతో ఉండటంతో ఆయన స్టైల్ ను ఫాలో అవుతూ ఫోటోలు దిగుతూ బాగా షేర్ చేస్తుంటాడు.
దీంతో అచ్చం రజినీకాంత్ లాగా ఉండటంతో ఈయనకు మరింత ఫాలోయింగ్ పెరిగింది.
ఇక ఈయన ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూలలో కూడా పాల్గొన్నాడట.
ఇక ఈయన రజినీకాంత్ రూపం గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు.అవును.
నేను పాకిస్థాన్ సూపర్ స్టార్‌ని.నిజంగా ఒక గొప్ప స్టార్ పోలికలతో నేను ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది.ఇది మాత్రం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను.
నా ఫొటోలను పాకిస్థాన్ ప్రజలే కాకుండా.భారత్, బంగ్లాదేశ్, సౌదీకి చెందిన వాళ్లు కూడా షేర్ చేస్తుండటంతో నిజంగా ఆ సూపర్ స్టార్‌కి ఇంత ఫాలోయింగ్ ఉందా? అని అనిపిస్తుందని అన్నాడు.ఇక ఇది తలచుకున్నప్పుడల్లా.
చాలా గర్వంగా అనిపిస్తుంది.అని అన్నాడు.
మొత్తానికి రజనీకాంత్ లాగా ఉన్న వ్యక్తి పాకిస్తాన్ లో ఉండటంతో అక్కడ కూడా రజినీకాంత్ కి మంచి ఫాలోయింగ్ ఉందని తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు.ప్రస్తుతం ఆయన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.