Director Anudeep Mega Hero: మెగా హీరోకు కథ చెప్పిన 'జాతిరత్నాలు' దర్శకుడు

జాతి రత్నాలు సినిమా తో ఒక్క సారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టి తో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అనుదీప్ కె.వి.

 Jathiratnalu Director Anudeep Kv Get Mega Chance Details, Director Anudeep Mega-TeluguStop.com

ఈయన జాతి రత్నాలు సినిమా విడుదలైన వెంటనే తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కి ఒక స్టోరీ చెప్పి అతని తో ఓకే చెప్పించుకున్నాడు.తెలుగు మరియు తమిళం లో శివ కార్తికేయన్ హీరో గా ప్రిన్స్‌ అనే సినిమా ను తెరకెక్కించి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

దీపావళి కానుకగా అనుదీప్ దర్శకత్వం లో వచ్చిన ప్రిన్స్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమైంది.అయినా కూడా దర్శకుడు అనుదీప్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

తాజాగా ఒక మెగా హీరో నుండి పిలుపు వచ్చిందని సమాచారం అందుతుంది.

గతంలో అనుదీప్ ఆ హీరో కి స్టోరీ లైన్ చెప్పాడని, ఇప్పుడు అదే స్టోరీ లైన్ పూర్తి కథ గా చెప్పాలంటే ఆహ్వానం దక్కిందని సమాచారం అందుతుంది.

మెగా హీరో తో సినిమా అంటే కచ్చితం గా అది భారీ ప్రాజెక్టు అవుతుంది అనడంలో సందేహం లేదు.అనుదీప్ ఈసారి కచ్చితంగా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ను తెరకెక్కిస్తే కెరియర్ లో వెన్ను తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అంటూ ఆయన సన్నిహితులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.

Telugu Anudeep Kv, Anudeep, Jathi Ratnalu, Prince, Telugu-Movie

జాతి రత్నాలు సినిమా క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు.అందుకే భారీ ఎత్తున అనుదీప్ కి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.తాజాగా వచ్చిన ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటే ముందు ముందు స్టార్ హీరో లు కూడా అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చిన ఆ మెగా హీరో ఎవరు అనే విషయం మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube