ఏపీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.తమ పార్టీ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు అరెస్ట్ పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని చంద్రబాబు సూచించారు.అనంతరం అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతిని ఫోన్ లో పరామర్శించారు.
వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.అక్రమ అరెస్ట్ పై న్యాయపరంగా పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు.