Krishna Vijayanirmala Indiradevi: కృష్ణ తల్లిదండ్రులు మొదటి భార్య ఇందిరను కాదని విజయ నిర్మల వద్ద ఎందుకు ఉండేవారు ?

సూపర్ స్టార్ కృష్ణ తన మేన మరదలు అయినా ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాక పిల్లలు జన్మించాక విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.కృష్ణ, విజయ నిర్మల ల ప్రేమ కథ, పెళ్లి గురించి ఇప్పటికే అనేకసారి విన్నాం.

 Krishna Parents Love Towards Vijaya Nirmala Details, Krishna, Vijaya Nirmala, In-TeluguStop.com

ఇక్కడ చాల మందికి తెలియని విషయం ఏంటి అంటే విజయ నిర్మల వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వకపోవడం నిజంగా ఆశ్చర్యకరం.విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న కూడా ఇందిరకు విడాకులు ఇవ్వలేదు.

ఇందిరా తో పిల్లలను కూడా కన్నాడు.ఇక ఇందిరా దేవి తో కూడా విజయ నిర్మల స్నేహంగానే ఉండేది.

ఆమె ఏనాడూ మొదటి భార్య గురించి తప్పుగా మాట్లాడలేదు.మహేష్ బాబు కుటుంబం కూడా కృష్ణ నిర్ణయాన్ని స్వాగతించారు.

ఇందుకు ప్రధాన కారణం విజయ నిర్మల వ్యక్తిత్వమే.ఆమె అందరితో సఖ్యతగా ఉండటానికే ప్రయత్నించింది.కుటుంబం కలిసి ఉండాలనే ఉద్దేశం తో ఇగోలకు పోకుండా అందరికి దగ్గర అయ్యింది.ఇక అందరి సంగతి ఎలా ఉన్న కృష్ణ తల్లిదండ్రులు కూడా విజయ నిర్మలను ఒప్పుకోవడం విశేషం.

కృష్ణ పెళ్లి చేసుకున్న నిర్ణయం తెలిసిన వెంటనే అందరు షాక్ అయినా అందరికంటే ముందు కృష్ణ నిర్ణయాన్ని స్వాగతించారు అయన తల్లిదండ్రులు.విజయ నిర్మల కృష్ణ ఉండే గండిపేట ఇంట్లోనే వారు కూడా ఉండేవారు.

తొలి భార్య ఇందిరా ను కాదని వారు విజయ నిర్మలకు సపోర్ట్ చేయడం కుటుంబానికి నచ్చలేదు.

Telugu Indira Devi, Krishna, Mahesh Babu, Vijaya Nirmala-Movie

అయినా కూడా కృష్ణ ఇష్టాన్ని వారు వ్యతిరేకించలేదు.విజయ నిర్మల తన వంటలతో తన త్తగారిని బుట్టలో పడేశారట.ఈ విషయాన్నీ విజయ నిర్మల ఒక ఇంటర్వ్యూ లో తెలపడం విశేషం.

తన చివరి శ్వాస వరకు తన చేతి వంట కథినే ఉండేవారని, పని వాళ్ళు చేస్తే తన అత్త గారికి నచ్చదని, చివరికి చనిపోయే రోజు బెండకాయ కూర, రసం చేసి పెట్టమని అడిగారని తెలిపారు.ఆలా తన వంట వల్ల అత్త మామలతో ప్రేమ పెరిగిందని, తనను ఎంతో బాగా చూసేవారని తెలిపింది.

 కృష్ణ సైతం ఎక్కడికి వెళ్లిన విజయ నిర్మల కోసం వెళ్లిపోయేవారట.షూటింగ్ లొకేషన్ కి కృష్ణ గారి కోసం ప్రతి రోజు వంట చేసి పంపేవారట విజయ నిర్మల.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube