అమరావతి రాజధాని కేసు విచారణ సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.రాజధాని పిటిషన్లపై విచారణ వేరే బెంచ్ కు బదిలీ అయింది.
ఈ కేసు విచారణ నుంచి సీజేఐ యూయూ లలిత్ తప్పుకున్నారు.అమరావతి పిటిషన్ పై తాను సుముఖంగా లేనని తెలిపారు.
తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి పంపాలని సూచించారు.ఈ క్రమంలో తదుపరి ఏ ధర్మాసనం, విచారణ తేదీ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు.
ఈ మేరకు స్పందించిన జస్టిస్ లలిత్ తాను విచారణ చేయనప్పుడు తేదీ నిర్ణయించడం సబబు కాదని వెల్లడించారు.వీలైనంత త్వరగా విచారణకు అనుమతి ఇవ్వాలని సూచించారు.