ఏనుగును కాపాడిన చిన్నారి.. కృతజ్ఞతలు తెలిపిన గజరాజు వీడియో వైరల్..

అడవిలో ఎన్నో జంతువులతో పాటు అతి పెద్ద జంతువులైన ఏనుగులు కూడా నివసిస్తూ ఉంటాయి.ఏనుగులను ప్రజలు భక్తితో గజరాజు అని కూడా పిలుస్తూ ఉంటారు.

 The Child Who Saved The Elephant , Elephant,girl, Gajaraju,elephant Stuck In The-TeluguStop.com

ఏనుగులు చాలా తెలివైనవి.ఇవి అనేక రకాల భావోద్వేగాలను కలిగి ఉంటాయి.

ఏనుగులు ఎదుటివారిని అర్థం చేసుకొని మనుషులతో ప్రేమగా మెలుగుతాయి.వాటిని మాత్రం అస్సలు రెచ్చగొట్టకూడదు.

ఏనుగులు మనుషులతో స్నేహపూర్వకంగా ఉల్లాసంగా సంతోషంగా ఉంటాయి.

ఈ మధ్యకాలంలో అడవుల్లో ఉన్న చాలా ఏనుగులు ప్రమాదాలకు గురవుతున్నాయి.

అలాగా ఒక బురద గుంటలో పడిపోయిన ఏనుగు పిల్లను జెసిపి తెచ్చి దాన్ని బయటికి తెచ్చిన వీడియోను అందరూ చూసే ఉంటారు.ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ఒక చిన్న ఏనుగు ఒక గ్రామ దారి లో ఉన్న చెరుకు పొలానికి మధ్యలో ఉన్న బురద గుంటలో చిక్కుకుపోయినట్లు ఆ వీడియోలో చూడవచ్చు.అదృష్టవశాత్తు ఒక అమ్మాయి దానిని రక్షించడానికి వచ్చి దానిని ఆ బుర్ద గుంటలో నుంచి బయటకు తీసుకురావడానికి తన శక్తినంత ఉపయోగించి ప్రయత్నించింది.

ఆ చిన్నారి ఏనుగు కాళ్ళను గుండెలో నుంచి బయటకు తీసుకువచ్చి గజరాజును బయటకు తీసుకురావడంలో విజయం సాధించింది. ఏనుగు బురదలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ నోరులేని జీవి ఆ యువతికి కృతజ్ఞతలు చెప్పినట్లు దాని తొండం తో ఆ అమ్మాయి తల వైపుకు ఎత్తినట్లు చేసింది.ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశాడు.క్యాప్షన్ ఇలా రాసి ఉంది.బురదలో కూరుకుపోయిన ఏనుగు పిల్ల బయటకు రావడానికి ఈమె సహాయం చేసింది.దాంతో ఆ బాలికకు గజరాజు కృతజ్ఞతలు చెబుతున్నట్టుగా ఆశీర్వాదం తెలిపింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇలా మూగజీవులపై ప్రేమను చూపే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube