జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్విట్ చేశారు.అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా శనివారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో బర్త్ డే విషెష్ చెప్పారు.
అయితే హిందీలో పవన్ కళ్యాణ్ ట్విట్ చేయగా.దానికి అమిత్ షా తెలుగులో రీట్విట్ పంపారు.
భారతదేశం ఐక్యమత్యంగా ఉండటానికి, దేశ భద్రత, సురక్షత విషయంలో హోంశాఖ మంత్రి అమిత్ షా నిరంతరం కృషి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.అయితే ఈ ట్విట్‌కు అమిత్ షా రిప్లై ఇచ్చారు.
‘నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు.’ అని తెలుగులో రిట్విట్ చేశారు.
జనసేనానిని ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.అయితే ఇటీవల విశాఖపట్నంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారా? అక్కడ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు.ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను, ప్రధాని మోడీని కలవబోనని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని ఇక్కడే తేల్చుకుంటానని క్లారిటీ ఇచ్చారు.
అయితే గతంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ఏర్పరచుకున్నప్పటికీ ఊహించిన స్థాయిలో వీరి పొత్తు ముందుకు సాగలేదు.
గతంలో రోడ్ మ్యాప్ అడిగినప్పుడు ఆ పార్టీ నేతలు ఇవ్వకపోవడంతో కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.తాజాగా పవన్ కళ్యాణ్ అమిత్ షాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం.
దానికి అమిత్ షా తెలుగులో బదులివ్వడం సంచలనంగా మారింది.అయితే గతంలో పొత్తుకు సోము వీర్రాజు ఢిల్లీ పెద్దలతో మాట్లాడారని, పవన్ కళ్యాణ్‌తో కూడా మాట్లాడినట్లు సమాచారం.
వీరందరూ కలిసి ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది.
అయితే ఇవన్నీ తప్పుడు సమాచారాలని, పవన్ కళ్యాణ్‌కు ఎవరూ ఫోన్ చేయలేదని, తను ఎక్కడికి వెళ్లడం లేదని జనసేన ప్రతినిధులు చెప్పుకొచ్చారు.ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపించడం లేదు.తిరుపతి ఉప ఎన్నికల తర్వాత ఇరు పార్టీల మధ్య దూరం బాగా పెరిగింది.
ప్రస్తుతం జనసేన-టీడీపీ పొత్తు ఏర్పరచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.