ఎస్‌బీఐ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ల్యాప్‌ట్యాప్ కొనుగోళ్లపై కళ్లు చెదిరే ఆఫర్

పండగల సమయంలో వివిధ ప్రొడక్టుల సమయంలో భారీ ఆఫర్లు ఉంటాయి.వాటిని సద్వినియోగం చేసుకుని భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

 Good News For Sbi Cardholders Eye Catching Offer On Laptop Purchases ,sbi Accou-TeluguStop.com

ముఖ్యంగా క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించి భారీగా డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు పొందొచ్చు.ప్రస్తుతం SBI క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఎంపిక చేసిన HP ఉత్పత్తులపై 10,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.23 సెప్టెంబర్ 2022 – 31 అక్టోబర్ 2022 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.కేవలం ఎంపిక చేసిన హెచ్‌పీ ఉత్పత్తులపై, ఈఎంఐ ద్వారా కొంటే మాత్రమే ఇది వర్తిస్తుంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Credit, Debit, Sbi, Sbi Credit-Latest News - Telugu

ప్రస్తుతం అంతా వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నారు.ఫలితంగా ల్యాప్‌టాప్, డెస్క్ టాప్ కంప్యూటర్లు కొనుగోలు చేస్తున్నారు.సరైన, నాణ్యమైన ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలని అంతా భావిస్తున్నారు.

అయితే పండగల సమయంలో తమకు నచ్చిన ల్యాప్‌టాప్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా హెచ్‌పీ వంటి ప్రముఖ కంపెనీపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుదారులకు ప్రస్తుతం అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది.ఎంపిక చేసిన హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే వారికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు నుంచి చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు.

ముఖ్యంగా 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు ఇలా వివిధ కాల పరిమితితో కూడిన ఈఎంఐ పద్ధతిలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయొచ్చు.తద్వారా రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు.ప్రస్తుతం ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకే అందుబాటులో ఉంది.

మీరు వివిధ ఈ కామర్స్ వెబ్‌సైట్‌లను సందర్శించి, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను తక్కువ ధరకే కొనుగోలు చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube