ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ కీళ్ల నొప్పులు వస్తున్నాయి.ప్రతిరోజు ఈ కీళ్ల నొప్పులు తగ్గడానికి చాలామంది ఎన్నో రకాల మందులను వాడుతున్నారు.
అదేవిధంగా ఆయుర్వేద మందులను కూడా వాడుతున్నారు.నొప్పులు ఉన్నచోట క్రీం లను బామ్ లను పూసుకుంటున్నారు.
అయినప్పటికీ ఈ కీళ్లనొప్పులు మాత్రం పూర్తిగా తగ్గడం లేదు.కానీ ఈ కీళ్లనొప్పులు తగ్గడానికి అదేవిధంగా కీళ్ల మధ్యలో శబ్దం రాకుండా జిగురు పెరగడానికి కొన్ని ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి.
అయితే కీళ్ల మధ్య ఉండే జిగురు అనేది కీళ్ళు సాఫీగా కదిలేలా చేస్తుంది.ఇక ఈ సమస్య ప్రారంభంలో ఉంటే ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.
అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూనే ఈ రెమిడీ ఫాలో అవ్వవచ్చు.ఆ రెమెడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అయితే ముందుగా దీని కోసం 3 పదార్థాల అవసరం ఉంటుంది.అయితే ముందుగా 50 గ్రాముల శొంఠిని ముక్కలుగా కట్ చేసి నూనె లో వేగించి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వాము తీసుకొని పాన్ లో వేయించి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.మెంతులు, వాము పొడిలో శొంఠి పొడిని బాగా కలపాలి.
ఇకపోతే ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో పోసి నిల్వ చేసుకోవాలి.
ఎందుకంటే గాలి తగలకపోతే ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.ఇక ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి కలుపుకొని పడగడుపున తాగాలి.ఈ విధంగా 15 రోజులు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
పొడి ప్రతి రోజు తీసుకుంటే కీళ్ల మధ్య శబ్ధం తగ్గి కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది.కీళ్ల మధ్య కావల్సినంత జిగురు ఉంటే కీళ్ల నొప్పులు ఉండవు.