నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది.సండే మార్కెట్ లోని ఓ షాపు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది.
షాపు తమదంటే తమదంటూ పరస్పర దాడులకు దిగారు.ఇరు వర్గాల సభ్యులు రోడ్లపై పరుగులు పెడుతూ నానా హంగామా సృష్టించారు.
దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలపై లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
అనంతరం దాడులకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.