తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 13 రోజులపాటు కొనసాగనుంది.రాష్ట్రంలో 359 కిలోమీటర్లు రాహుల్ గాంధీ నడవనున్నారు.
మక్తల్ నియోజకవర్గం లోని కృష్ణా గ్రామం వద్ద భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనుంది.మరోవైపు తెలంగాణలో రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ పై చర్చించినట్లు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
ఏ దారి గుండా యాత్ర సాగాలనే దానిపై చర్చించినట్లు వెల్లడించారు.సూత్రప్రాయంగా మార్గాన్ని ఆమోదించామన్న ఆయన పోలీసుల భద్రత కోసం రేపు డిజిపిని కలవనున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా వచ్చే నెల నాలుగున జాతీయ నాయకత్వంతో చర్చిస్తామని తెలిపారు.పాదయాత్రలో నడుస్తున్న వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, పాదయాత్ర కోసం సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వివిధ పనులను విభజించి ముఖ్య నేతలకు అప్పగిస్తామని చెప్పారు.కుదిరితే రాహుల్ సందర్శించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
ప్రజలు పార్టీలకు అతీతంగా జోఢోయాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.