ఆదిపురుష్‌ టీజర్ అప్‌డేట్‌ రేపు.. ఫ్యాన్స్ కి ముందే రానున్న పండుగ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్‌ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.సినిమా టీజర్ ని దసరా కానుకగా అక్టోబర్ 2వ తారీఖున విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతుంది.

 Prabhas Adipurush Movie Teaser Update Prabhas , Adipurush Movie ,teaser Update-TeluguStop.com

రేపు అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారట.టీజర్ విడుదలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపు సాయంత్రం సోషల్ మీడియా ద్వారా దర్శకుడు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు ఓం రౌత్ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ దాదాపుగా పూర్తి చేయించాడు.నవంబర్ నెల వరకు సినిమా యొక్క ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని చిత్రం నిర్మాతలు అంటున్నారు.

అందుకే చాలా నమ్మకంగా సినిమా యొక్క టీజర్ ని దసరా సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అయోధ్యలో భారీ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా యొక్క టీజర్ విడుదల చేస్తారని గత వారం పది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.రేపు అందులో భాగంగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ఆదిపురుష్‌ సినిమా యొక్క టీజర్ విడుదల కార్యక్రమం ఉంటుందని జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.రేపు అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

టీజర్ ప్రకటించడం కోసం ఒక పోస్టర్ ని కూడా రెడీ చేశారట, ప్రభాస్ ఆ పోస్టర్ కి ఓకే చెప్తే వెంటనే రేపు రిలీజ్ చేయబోతున్నారు.నేడు పెదనాన్న సంతాప సభ నిమిత్తం మొగల్తూరు వెళ్లిన ప్రభాస్ రాత్రి వరకు హైదరాబాద్ చేరుకుంటారు.

ఆ తర్వాత ఆదిపురుష్‌ అధికారిక ప్రకటనపై మరింతగా చర్చ జరుగుతుందని తెలుస్తోంది.అక్టోబర్ రెండో తారీఖున అయోధ్య కు ప్రభాస్ వెళ్తారని సమాచారం అందుతుంది.

రేపు ఆ విషయం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube