టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.ఇండస్ట్రీకి అనేక బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మహేష్ బాబు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
శ్రీమంతుడు, భరత్ అనే నేను, దూకుడు, ఒక్కడు లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఆయన తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.ఓవైపు సినిమాల్లో నటిస్తూ బాగానే డబ్బులు కూడా బెడుతున్న మహేష్ బాబు అంతకన్నా ఎక్కువగా బిజినెస్ లతో, బ్రాండ్స్ ప్రమోషన్స్ తో అడ్వర్టైజ్మెంట్ ద్వారా సంపాదిస్తున్నారు.
తన తండ్రి ఇచ్చిన వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయన కూడా అనే ఆస్తులు కూడా పెట్టారు.ఈ క్రమం లో మహేష్ బాబు దగ్గర ఉన్న అత్యంత లక్సరీ వస్తువులు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇల్లు
జూబ్లీహిల్స్ లో అత్యంత విలాసవంతమైన బంగ్లా కలిగి ఉన్న మహేష్ బాబు ఈ ఇంటిలో తన భార్య, పిల్లలు మరియు తల్లితో కలిసి జీవిస్తున్నారు.ఈ ఇంటి ఖరీదు దాదాపు 30 కోట్లుగా ప్రస్తుతం మార్కెట్ విలువ ఉంది.దీంట్లో స్విమ్మింగ్ పూల్ తో పాటు ఓపెన్ రూప్ టాప్ పార్టీ ఏరియా కూడా ఉన్నాయి.
వానిటీ వ్యాన్
మహేష్ బాబుకి ఎంతో ఖరీదైన అత్యంత ఆకర్షణీయమైన ఒక వ్యానిటీ వ్యాన్ కూడా ఉంది 6:30 కోట్లు కాక ఇది చిన్న సైజు విల్లాను తలపిస్తుంది.
ఏ ఎం బి సినిమాస్
మహేష్ బాబు, ఏషియన్ సంస్థ కలిపి నిర్మించిన థియేటర్ ఏ ఎం బి సినిమాస్. దీని ధర ఏకంగా 80 కోట్ల రూపాయలు.
రేంజ్ రోవర్ వోగ్
తన భార్య నమ్రత మహేష్ బాబు పుట్టిన రోజుగా అతడికి ఈ కారుని బహుకరించింది.దీని ధర నాలుగు కోట్లు కాగా, 2010లో ఈ బహుమతి అందుకున్నాడు మహేష్ బాబు.
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ
2020లో కూడా మరొక రేంజ్ రోవర్ కార్ ని సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు.దీని ధర కూడా నాలుగు కోట్లకు పైగానే ఉంటుంది.
లంబోర్ఘిని గల్లార్డో
ఇప్పటికే రెండు రేంజ్ రోవర్లు కార్లు కలిగి ఉన్న మహేష్ బాబు లంబోర్ఘిని కారును సైతం కలిగి ఉన్నాడు.ఇది టూ సీటర్ స్పోర్ట్స్ కారు కాగా దీని ధర 2.80 కోట్లు.
ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కారు
మహేష్ బాబుకి కార్లంటే ఎంత మక్కువో అతడి గ్యారేజ్ కలెక్షన్ చూస్తేనే అర్థమవుతుంది.ఇటీవల కాలంలో మహేష్ బాబు ఒక ఆడి కారును కూడా తన గ్యారేజ్ లో పెట్టుకున్నాడు.దీని ధర ఒకటి పాయింట్ 19 కోట్లు.
మెర్సిడీజ్ బెంజ్
దాదాపు 85 లక్షల విలువ చేసే మెర్సిడీజ్ బెంజ్ కూడా మహేష్ బాబు దగ్గర ఉంది ఈ కారు 85 లక్షలు కాగా దీని ప్రారంభ ధర 66 లక్షలు.
ఇదే కాకుండా 50 లక్షల విలువ చేసే ఫియాజెట్ పోలో వాచ్ తో పాటు అలాగే 45 లక్షల బ్రెగ్యూట్ మెరైన్ క్రోనో గ్రాఫ్ వాచ్ కూడా మహేష్ దగ్గర ఉంది.