మునుగోడులో రెడ్డి వర్సెస్ రెడ్డి.. మూడు ప్రధాన పార్టీల నుండి రెడ్డిలకే టికెట్లు!

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక రెడ్డి వర్సెస్ రెడ్డి పోరుగా మారే అవకాశం ఉంది, పోటీలో ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధన్యత ఇచ్చాయి.నియోజకవర్గంలో సంఖ్యాపరంగా 60% ఓటర్లు ఉన్న BCలకు కాకుండా 5% కంటే తక్కువ జనాభా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

 Reddy Leaders Favorite Pick Of Telangana Political Parties In Munugode By Electi-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతి రెడ్డిని బరిలోకి దించగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వనుంది.ఇక తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తన అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఆ పార్టీ సీనియర్ నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశం కనపిస్తుంది.

మునుగోడులో తెరాస టికెట్‌ను 3 అభ్యర్థులు అశిస్తున్నారు.వారిలో ఇద్దరు బీసీ అభ్యర్థులు ఉన్నప్పటికీ తెరాస కూసుకుంట్ల వైపే మెుగ్గు చూపనున్నట్లు సమాచారం.ఆర్థికంగా, రాజకీయ ప్రభావం ఉన్న కూసుకుంట్ల ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వగలడని తెరాస భావిస్తుంది.పూర్వపు నల్గొండ జిల్లాలో ఉన్న మునుగోడు కమ్యూనిస్ట్ పార్టీలకు కంచుకోటగా ఉండేది.

ఇక ఈసారి వామపక్షాలు (సీపీఐ, సీపీఐ(ఎం)) టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపగా, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ముందుగా ప్రకటించిన విధంగా బీసీ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమైంది.

Telugu Congress, Komatirajagopal, Munugode, Palvaisravanthi-Political

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి కులాల అభ్యర్థులకు  ప్రాధన్యత ఇవ్వగా, బీఎస్పీ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతుంది.2.30 లక్షల మంది ఓటర్లు ఉన్న మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ ఉప ఎన్నిక ఫలితం రానున్న ఎన్నికలపై ప్రభావం చూపనుంది.ముఖ్యంగా ఈ  ఎన్నికను కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డి మునుగోడులో కాంగ్రెస్‌ను పార్టీని ముందుండి నడిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube