ఏపీ రాష్ట్ర రాజకీయాల(Politics of Andhra Pradesh)లో బూతులు తిట్టే సంస్కృతి తార స్థాయికి చేరింది.రాష్ట్ర శాసన సభ వేదికగా ప్రధాన పక్షం, ప్రతి పక్షం మధ్య జరిగే మాటలు యుధ్దం ప్రజలను ముక్కు మీద వేలేసుకునేలా చేసింది.
అయితే తాజాగా అసెంబ్లీ సభా వ్యవహారాల సంఘం (BAC) సమావేశంలో బూతులు తిట్టే సంస్కృతిని ప్రారంభించింది ఎవరన్నదానిపై అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.జగన్మోహన్‌రెడ్డిని టీడీపీ(TDP) నేతలు ఆ మర్వాదగా మాట్లాడుతున్నారని వైసీపీ ఆరోపించగా.
చంద్రబాబు(chandrababu naidu)పై బూతులు మాట్లాడుతుంది ఎవరని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
బీఏసీలో ఇరువురి నేతల మధ్య వాడివేడి చర్చ జరిగినట్లుగా సమాచారం.
ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా కనీసం గారు అనకుండా, ఆయన కుటుంబ సభ్యులపై కూడా విమర్శలు చేస్తున్నారు.టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు జగన్‌పై ఎలాంటి భాష మాట్లాడారో తెలుసుకోవాలని అచ్చెన్నను వైసీపీ మంత్రులు ప్రశ్నించారు.
మరీ కొడాలి నాని చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై మాట్లాడే భాష ఏంటంటూ అచ్చెన్న నిలదీశారు.ఇలా కుటుంబ సభ్యులను ప్రతి పక్షం నేతలను బూతులు తిట్టడం మొదలు పెట్టింది కొడాలి నాని, వల్లభనేని వంశీ కాదా? అంటూ అచ్చెన్నాయుడు (acham naidu) ప్రశ్నించారు.
గురువారం టీడీపీ ఎమ్మెల్యే స్వామిని దళితుడికే పుట్టావా అంటూ మీ మంత్రి మాట్లాడారు.ఇలా మాట్లాడడం ఏంటీ.అంటే పద్ధతులు మీకు వర్తించవా అంటూ ఘూటుగా స్పందించారు.అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా స్పందించారు.అయ్యన్నపాత్రుడు గుంటూరు సభలో జగన్‌ను ఉద్దేశించి మాట్లాడిన విషయంపై ఏమంటారని ప్రశ్నించారు.చంద్రబాబు ఇచ్చిన స్క్రీప్ట్ చదువుతూ తిట్టారని ఆరోపించారు.
అయ్యన్నపాత్రుడు సీఎం తిట్టడం వల్లే జోగి రమేశ్ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాడని వైసీపీ మంత్రి బదులిచ్చారు.మెుత్తం మీద BAC సమావేశం చాలా వాడివేడిగా జరిగింది.
ఈ సమావేశంలో నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.