రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిరాల, చిన్న రావిరాలలో భూమి కోల్పోయిన రైతులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మద్ధతు తెలిపారు.వారి సమస్యలను పరిష్కారానికి 72 గంటల పాటు దీక్ష చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 21వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 11 గంటల వరకు దీక్షను కొనసాగిస్తానన్నారు.రైతులకు తను అండగా ఉంటానని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలను 72 గంటల్లోగా పరిష్కరించకపోతే భూనిర్వాసితులకు న్యాయం జరగడం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కోమటిరెడ్డి వెల్లడించారు.