తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈయన తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
తరచూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ వారిపై నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఎన్నో మంచి మంచి సినిమాలతో దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం బూతు సినిమాలతో పూర్తి వెనక్కి పడిపోయాడు.
ఇక రాంగోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో తెరకెక్కించిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేకపోగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తున్నాయి.
అంతేకాకుండా వాటికి రివ్యూలు కూడా కనిపించడం లేదు.
అయినప్పటికీ రాంగోపాల్ వర్మ మాత్రం ఏమాత్రం తగ్గకుండా అదే రీతిలోనే సోషల్ మీడియాలో నిలుస్తున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి వార్తలో నిలిచాడు రాంగోపాల్ వర్మ.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, సోషల్ మీడియాలో, ఇంస్టాగ్రామ్ లలో ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ పేరు మారుమోగిపోయింది.అయితే రాంగోపాల్ వర్మ విషయాన్ని మర్చిపోయాడు లేకుంటే ఏమో తెలియదు కానీ ఈ విషయం పట్ల మాత్రం పవన్ అభిమానులు వర్మ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బర్త్ డే అని తెలిసినా కూడా ట్వీట్లు వేయడం లేదు.కానీ కన్నడ హీరో సుదీప్ మీద ట్వీట్ వేశాడు.
ఈ విషయం పై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.వన్ అండ్ ఓన్లీ స్టార్, యాక్టర్ అంటూ ఇలా సుదీప్ మీద ప్రశంసలు కురిస్తూ వర్మ ట్వీట్ వేశాడు.దీనిపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.అయినా నీ దగ్గరి నుంచి ఇంత కంటే మేం ఏమీ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయడం లేదులే.అంటూ సెటైర్లు వేస్తున్నారు.మొత్తానికి వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
కొందరు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని తెలిసి కూడా కామెంట్స్ చేయలేదు అని అనగా, మరికొందరు మాత్రం ఆయన సోషల్ మీడియా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.