షర్మిల కు ఇబ్బందికరంగా ' మునుగోడు ' ? అభ్యర్థి ఎంపికపై తర్జన భర్జన?

మునుగోడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారినా,  తెలంగాణలో కొత్తగా వైయస్సార్ తెలంగాణ  పేరుతో పార్టీ పెట్టిన షర్మిలకు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ , బిజెపి ,టిఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా,  షర్మిల సైతం అంతే స్థాయిలో ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Sharmila Embarrassingly 'before' Tarjana Bharjana On Candidate Selection , Munu-TeluguStop.com

ఇప్పటివరకు ఏ  ఎన్నికల్లోను షర్మిల పార్టీ పోటీ చేయలేదు.అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తప్పకుండా పోటీ చేసి సత్తా చాటుకోవాలని చూస్తున్నారు.

ఈ ఎన్నికల్లో కనుక వైఎస్సార్ తెలంగాణ పార్టీ అభ్యర్థి గెలవకపోతే అది రాబోయే సార్వత్రిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనే ఆందోళన షర్మిలలో నెలకొంది.ఈ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారట.

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు మంచి పట్టి ఉంది.ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈ జిల్లాలో గట్టుపట్టు ఉండడం,  వీరిద్దరూ షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి వీర అభిమానులు కావడంతో పాటు, గతంలో వైఎస్ షర్మిల నిరాహార దీక్ష ప్రారంభించిన సందర్భంగా ఆమెకు మద్దతుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి మరి మద్దతు ప్రకటించారు.

Telugu Aicc, Congress, Munugodu, Pcc, Revanth Reddy, Telangana, Ys Rajashekara,

అలాగే వైఎస్ విజయమ్మ నిర్వహించిన ఆత్మీయుల సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు .ఈ విధంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తులుగా ఉండడంతో, ఈ ఎన్నికల్లో షర్మిల రాజగోపాల్ రెడ్డి విషయంలో షర్మిల ఏ విధంగా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఇక అభ్యర్థి విషయానికి వస్తే, ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉండటంతో, ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దించాలని షర్మిల భావిస్తున్నారు.దీనికోసం బలమైన అభ్యర్థి కోసం ఆమె వెతుకులాట మొదలు పెట్టినట్లు సమాచారం.

కానీ ప్రధాని పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో అభ్యర్థులు లేకపోవడం షర్మిలకు ఇబ్బందికరంగా మారింది.దీంతో కాంగ్రెస్ నుంచి ఎవరైనా బలమైన నేత తమ పార్టీలో చేరితే వారికి టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నారట.

కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు అంతగా ఆసక్తి చూపించడం లేదట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube