అనసూయ దెబ్బకు పారిపోయిన బ్రహ్మానందం.. మరి అంతలా భయపెట్టాలా?

అనసూయ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకొని ఇతర ఛానల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ తో కలిసి అనసూయ స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

 Brahmanandam Who Ran Away Due To Anasuya Should Be Scared So Much ,brahmanandam,-TeluguStop.com

ఈ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుదీర్ అనసూయ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలు ఇప్పటికే తమ అద్భుతమైన గాత్రంతో పాటలు పాడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక వచ్చేవారం ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే పూర్తికానుంది.ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేలో భాగంగా కామెడీ కింగ్ బ్రహ్మానందం, కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని అనసూయ వేదికపైకి ఆహ్వానిస్తుంది.

ఈ క్రమంలోనే బ్రహ్మానందం గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ అనసూయ గట్టిగా వెల్కమ్ టు బ్రహ్మానందం గారు అని ఒక్కసారిగా అరవడంతో దెబ్బకు బ్రహ్మానందం వేదికపై నుంచి పరుగులు పెట్టారు.ఇలా బ్రహ్మానందం సుధీర్ వెనక దాక్కొని అనంతరం బయటకు వచ్చి అదేంట్రా నేను పక్కనే ఉన్నాను కదా అలా అరిచిందేంటి అంటూ ఒక్కసారిగా అనసూయ పై కౌంటర్ వేశారు.బ్రహ్మానందం ఇలా అడిగేసరికి సుధీర్ మాట్లాడుతూ మీరు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉండడంతో అలా అరిచింది అని చెప్పడంతో అలా కాకుండా ఎలా అంటావ్?మీరు ఈ కార్యక్రమానికి రావడం చాలా దారుణంగా ఉందని కూడా చెబుతావా అలా అనలేవు కదా? అంటూ మరోసారి సుధీర్ పై బ్రహ్మానందం పంచ్ వేశాడు.ఏది ఏమైనా బ్రహ్మానందం గారి కామెడీ పంచ్ ఇలా చాలా రోజుల తర్వాత చూసామని చెప్పాలి.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube