బాలీవుడ్ మోడల్ కం హీరోయిన్ సోనాల్ చౌహాన్ తెలుగులో ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.రెయిన్ బో సినిమా నుంచి ఈమధ్యనే వచ్చిన ఎఫ్ 3 వరకు అమ్మడు సోలో హీరోయిన్ గా కాకపోయినా సినిమాలు చేస్తూ వస్తుంది.
ఎఫ్ 3 సినిమాలో కూడా సోనాల్ నటించగా అది అంతగా ప్రాధాన్యత ఉన్న పాత్ర కాదని చెప్పొచ్చు.ఇదిలాఉంటే టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించింది.
ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగ్ హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమాలో సోనాల్ నటించింది.
చాలారోజుల తర్వాత అమ్మడికి తెలుగులో సోలో హీరోయిన్ గా వచ్చిన ఛాన్స్ ది ఘోస్ట్.
ఈ సినిమాపై సోనాల్ చాలా హోప్స్ పెట్టుకుంది.మరి సోనాల్ చౌహాన్ కి ఈ సినిమా అయినా కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.
అందం అభినయం రెండు ఉన్నా సరే అమ్మడికి లక్ కల్సి రాకుండాపోయింది.మరి సోనాల్ చౌహాన్ కోరుతున్న హిట్ ది ఘోస్ట్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.
నాగార్జున ది ఘోస్ట్ లో సోనాల్ చౌహాన్ గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.