'గుడి నీడ' మన ఇంటిమీద పడితే నిజంగా అలా జరుగుతుందా? ఏది నిజం?

భారతదేశంలో హిందూ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రత్యేకత వుంది.ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి మన దేశంలో కొన్ని ఆచారాల వెనుక ఎంతో నిగూఢార్ధం, సైన్స్ దాగివుంది.

 If The 'shadow Of The Temple' Falls On Our House, Does That Really Happen Which-TeluguStop.com

అయితే కాలక్రమేణా అలాంటి విషయాలు సామాన్యులకు అర్ధం కాక వాటినే మూఢనమ్మకాలుగా అర్ధం చేసుకున్నారు.అలాంటి విషయంలో ఒకటే.“గుడి నీడ ఇంటిమీద పడితే నాశనం అయిపోతాం!” అన్న సంగతి.అయితే నిజంగా అలాంటిది జరుగుతుందా? అసలు విషయం ఏమిటో ఇపుడు చూద్దాం.

ముఖ్యంగా ఎక్కువగా మనకు శివాలయం ఎదురుగానూ, విష్ణువు ఆలయాల వెనుకవైపున ఇళ్ళు కట్టుకోగూడదు అని చెప్తారు.కాలక్రమేణా అన్ని ఆలయాలకు దీన్ని వర్తింపజేశారు.దీని వెనుక వున్న కారణాలను ఒకసారి చూస్తే… పూర్వకాలంలో దేవాలయం దగ్గర ఇళ్ళు వుంటే దేవాలయం యొక్క పవిత్రమైన వాతావరణానికి ఇబ్బందిగా మారుతుందేమో అని దూరంగా కట్టుకోమని చెప్పే వారు.అలాగే దేవాలయాల వలన ఇళ్లలో వున్నవారికి ఇబ్బంది కలగకూడదని అలా చెప్పేవారు.

ఉదాహరణకి దేవాలయానికి వచ్చే భక్తులు గంట కొట్టడం వలన వస్తే శబ్ద కాలుష్యం కారణంగా ఇబ్బందయ్యే అవకాశం ఉంటుంది.అలాగే దేవాలయాలకు భక్తులు పోటెత్తినపుడు అనేక ఇబ్బందులు ఎదురు కావొచ్చని అలాంటి ఆచారాన్ని తీసుకొచ్చారు.

అయితే ఆ విధంగా చెప్తే ఎవరూ వినరని ఇలా నీడపడకూడదని చెప్పేవారు తప్ప ఈ విషయంలో ఎలాంటి దోషాలు లేవని తెలుసుకోవాలి.అయితే ఇది ఎలా తయారయ్యింది అంటే, ఆల్రెడీ దేవాలయం దగ్గర వున్న కట్టిన ఇల్లుని కూల్చేస్తున్నారు, లేదంటే ఇల్లు వదిలి వెళ్లిపోతున్నారు.

అది ముమ్మాటికీ మూర్ఖత్వమే అవుతుంది.కాబట్టి ఒకవేళ మీకు దేవాలయం పక్కనగాని, ఎదురుగాగాని ఇల్లు ఉంటే ఎటువంటి సందేహాలు పడకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube