మంత్ర ముగ్ధుల్ని చేసే అందం. అందరికీ మెస్మరైజ్ చేసే అభినయం.
పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నటన టాలెంట్ ఒక హీరోయిన్ స్టార్ హీరోయిన్ గా మారడానికి.కోట్ల మంది ప్రేక్షకులను సంపాదించడానికి ఇవి ఉంటే చాలు.
ఇవన్నీ కలగలిపిన ముద్దుగుమ్మ భానుప్రియ. నాటి తరం ప్రేక్షకుల నుంచి నేటి తరం ప్రేక్షకుల వరకూ భానుప్రియ సుపరిచితురాలే.
ఒకప్పుడు దశాబ్ద కాలానికి పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చలామణి అయ్యి స్టార్ హీరోలందరితో వరుసపెట్టి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ విజయాలను ఖాతాలో వేసుకుంది భానుప్రియ.
హీరోయిన్ గా దాదాపు 110 సినిమాల్లో నటించింది అంటే అది అంత ఆషామాషీ విషయం కాదు అని చెప్పాలి.
మొదటిసారి తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన భానుప్రియ తర్వాత తెలుగు తమిళ్ హిందీ ఇలా భాష తారతమ్యం లేకుండా తన హవా నడిపించింది.ఇక తెలుగులో తొలిసారి నటించిన సితార సినిమాతో నేషనల్ అవార్డు దక్కించుకుని అందరి చూపులను తనవైపు తిప్పుకుంది.
అయితే భానుప్రియ సినీ జీవితం గురించి చెప్పమంటే అందరు చెప్తారు.కానీ పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

భానుప్రియ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ సుమతీ కౌశల్ కుమారుడు ఆదర్శ్ కౌశల్ ని గాఢంగా ప్రేమించింది.ఆ తర్వాత పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని భావించింది.కానీ వీరి ప్రేమకు భానుప్రియ తల్లి విలన్ గా మారింది.పెళ్లి నాకు ఇష్టం లేదు అంటూ భానుప్రియ తల్లి చెప్పగా.ఎప్పుడూ తల్లికి ఎదురు చెప్పని భానుప్రియ మొదటిసారి ప్రేమ విషయంలో తల్లి కి ఎదురు మాట్లాడింది.

తల్లిని కాదని అమెరికా వెళ్లి అక్కడ ఆదర్శ కౌశల్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.కానీ అతడు నీకు తగిన వాడు కాదు అంటూ తల్లి చెప్పిన మాటలు తర్వాత నిజమయ్యాయి.పెళ్లి తర్వాత భానుప్రియ ఎంతో పశ్చాత్తాప పడింది.
కొన్నాళ్లకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి.ఒక కూతురు పుట్టిన తర్వాత ఆదర్శ కౌశల్ గుండెపోటుతో మరణించగా అప్పటినుండీ ఒంటరిగానే ఉంటోంది భానుప్రియ.