1.ఫీవర్ ఆసుపత్రిలో మంకీ ఫాక్స్ వార్డు
దేశంలో మంకీ ఫాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో , తెలంగాణలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో 36 పడకలతో మంకీ ఫాక్స్ వార్డును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
2.భద్రాద్రిలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

భారీ వర్షాలు వరదలు ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయక పునరావస చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తున్నట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
3.క్లౌడ్ వరస్ట్ కాదు సాధారణ వరదలే
తెలంగాణలో వర్షాలు వరదలపై క్లౌడ్ బరస్ట్ అంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ స్పందించారు.అవి సాధారణ వరదలేనని వ్యాఖ్యానించారు.
4.భద్రాచలం డిప్యూటీ డిఎంహెచ్ఓ సస్పెన్షన్

భద్రాచలం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజకుమార్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.
5.సీఎంఆర్ అనుమతుల కోసం ఢిల్లీకి రైస్ మిల్లర్లు
కష్టం మిల్లింగ్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న రైస్ మిల్లర్లు ఢిల్లీకి వెళ్లారు.పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీలను, కేంద్ర మంత్రులను కలిసి సీఎంఆర్ అనుమతి ఇప్పించాలని కోరేందుకు వెళ్లారు.
6.రేపటి నుంచి వరద ప్రాంతాల్లో షర్మిల పర్యటన

తెలంగాణలోని వరద ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పర్యటించనున్నారు.
7.30 నుంచి అగ్రి ఎంసెట్ ఆగస్టు 1 న ఈసెట్
ఈనెల 30, 31వ తేదీల్లో అగ్ని ఎంసెట్ ప్రవేశ పరీక్షలను, ఆగస్టు ఒకటిన ఈసెట్ ను నిర్వహించినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మందిర్ చైర్మన్, ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
8.సినీ నిర్మాత శేఖర్ రాజు పై రాంగోపాల్ వర్మ ఫిర్యాదు

సినీ నిర్మాత శేఖర్ రాజు పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
9.చిరంజీవిపై వ్యాఖ్యలు.పశ్చాతాపం వ్యక్తం చేసిన నారాయణ
తిరుపతిలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను భాషా దోషంగా పరిగణించాలని , ఈ విషయంలో తాను పశ్చాత్తాప పడుతున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
10.రామాయపట్నం పోర్టుకు జగన్ శంకుస్థాపన

రామాయణం పట్నం ఎంతో ప్రయోజనం ఉంటుందని ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అని ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమంలో అన్నారు.
11.జీఎస్టీ రేట్ల పెంపు పై టిఆర్ఎస్ ఆందోళన
జీఎస్టీ రేట్లు పెంచుతున్నట్లు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన చేసిన వెంటనే టిఆర్ఎస్ ఎంపీలు జీఎస్టీ పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు.
12.నేడు అంగప్రదక్షిణ టోకెన్ల విడుదల

తిరుమల తిరుపతి దేవస్థానం నేడు అంగ ప్రదర్శన టోకెన్లను విడుదల చేయనుంది.
13.కేఏ పాల్ ధర్నా
నేడు జంతర్ మంతర్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధర్నా చేపట్టారు .ఏపీ విభజన చట్టం, హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు
14.బియ్యం పంపిణీ లో తెలంగాణ ప్రభుత్వం విఫలం

బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది.
15.సొంత ఇంటి స్థలం ఉంటే మూడు లక్షలు మంజూరు : హరీష్ రావు
సొంత ఇంటి స్థలం ఉన్నవారికి మూడు లక్షలు మంజూరు చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.
16. గాంధీ కుటుంబాన్ని ఎవరు ఏమి చేయలేరు

కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబాన్ని ఎవరు ఏమీ చేయలేరని సీనియర్ నేత మల్లు రవి అన్నారు.
17.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
18.కేంద్రం ప్రకటనపై సిపిఐ అభ్యంతరం
విభజన హామీలు ఇప్పటికే అమలు చేశామని కేంద్రం ప్రకటించడాన్ని తప్పుపడుతున్నట్లు సిపిఐ నేత రామకృష్ణ అన్నారు.
19.జనసేన జనవాణి వాయిదా

జనసేన చేపడుతున్న జనవాణి కార్యక్రమాన్ని తాత్కారకంగా వాయిదా వేశారు .ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురవడమే కారణం
20.కార్యాలయం ముట్టడికి విద్యార్థి సంఘాల ప్రయత్నం
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
21.ప్రభుత్వ విప్ గా కరణం ధనశ్రీ

ఏపీ ప్రభుత్వ విప్ గా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని నియమించారు.
22.వరి నాట్లు వేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన యాత్ర బుధవారం నాటికి కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చేరింది.ఈ సందర్భంగా అక్కడ పొలాల్లో ప్రవీణ్ కుమార్ వరి నాట్లు వేశారు.
23.బిజెపి ఎంపీ అరవింద్ పై కేసు నమోదు
నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను దూర్బాషలాడారని , పరుష పదజాలంతో దూషించాడని ఆయనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.