ఆ విషయంలో నా ఆలోచనలు మారిపోయాయి.. చైతు స్టన్నింగ్ కామెంట్స్!

అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థాంక్యూ.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

 Naga Chaithanya Intresting Comments About Thank You Film Naga Chaithanya, Samana-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన కెరియర్ గురించి తన ఆలోచనల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ థాంక్యూ సినిమా తన జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చిందని తెలిపారు.సాధారణంగా ఎంతోమంది దర్శకులు సింగిల్ షేడ్స్ ఉన్న కథలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తారు.

అయితే ఇందులో తాను మూడు వయసులలో ఉన్న వ్యక్తిగా కనపడతానని ఈ చిత్రం ఎంతో విభిన్నంగా ఉండటమే కాకుండా ఈ సినిమా కథ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటుందని చైతన్య వెల్లడించారు.థియేటర్ కి ప్రేక్షకులు రావాలంటే సినిమాలు కొత్తదనం ఉండాలని భావిస్తారు ట్రైలర్ విడుదలైనప్పుడే ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాలా వద్దా అని ఫిక్స్ అవుతారని చైతన్య పేర్కొన్నారు.

Telugu Naga Chaithanya, Rashi Khanna, Samanatha, Tollywood, Vikram Kumar-Movie

ప్రేక్షకుల ధోరణి మారడంతో నేను కూడా సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో పూర్తిగా ఆలోచనలను మార్చుకున్నానని నాగచైతన్య వెల్లడించారు.సినిమా ఎంపిక చేసుకునేటప్పుడు హీరో డైరెక్టర్ అని కాకుండా కథ ప్రాధాన్యత చూసి ఎంపిక చేసుకోవాలని చైతన్య వెల్లడించారు.ఇక ఈ సినిమాతో తాను వ్యక్తిగతంగా ఎంతో మారిపోయానని, ఒకప్పుడు తనలో ఉన్న ఆలోచనలను ఎవరితో పంచుకోకుండా ఉండేవాణ్ణి అయితే ఇప్పుడు తన స్నేహితులు కుటుంబ సభ్యులతో చాలా క్లోజ్ అయ్యానని చైతన్య ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube