న్యూస్ రౌండప్ టాప్ 20

1.కెసిఆర్ కు రఘురామ లేఖ

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.తనను తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, కానీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ తమపైనే కేసులు నమోదు చేశారని రఘురామ లేఖలో పేర్కొన్నారు. 

2.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

3.19 నుంచి ఏపీ అసెంబ్లీ

Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది.ఈనెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు  

4.బిజెపి వైసిపి పై నారాయణ విమర్శలు

  బిజెపి ,వైసీపీ లపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు చేశారు.బిజెపి, వైసిపి బంధం చాలా అన్యోన్యంగా ఉందని, తల వంచి మెడవుంచి జగన్ మోదీ జపం చేస్తున్నారంటూ వ్యంగ్యంగా  విమర్శించారు. 

5.రేపు కడపకు సీఎం జగన్

Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు.రేపు, ఎల్లుండి రెండు రోజులు పాటు కడపలో జగన్ పర్యటిస్తారని అధికారులు తెలిపారు. 

6.నేటి నుంచి రాయలసీమలో చంద్రబాబు పర్యటన

 టిడిపి అధినేత చంద్రబాబు ఏపీలో జిల్లాల పర్యటన చేస్తున్న నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. 

7.నేటి నుంచి సప్లమెంటరీ పరీక్షలు

Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

ఏపీలో నేటి నుంచి పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 

8.నేడు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

  శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.ఈనెల 12 ,15 ,17 తేదీలకు సంబంధించిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. 

9.ఢిల్లీలో బోనాలు

Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

నేడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బోనాలు నిర్వహించనున్నారు.  నేడు బిజెపి జాయినింగ్ కమిటీ తొలి భేటీ జరగనుంది.బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 

11.నేడు కాంగ్రెస్ రచ్చబండ

  నేడు కిసాన్ కాంగ్రెస్ ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

12.నేటితో ఇంటర్ రీవాల్యుయేషన్ గడువు ముగింపు

Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

నేటితో ఇంటర్ రీ వాల్యుయేషన్ గడువు ముగియనుంది. 

13.ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలు విడుదల

  నాలుగేళ్ల క్రితం నిర్వహించిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలు విడుదలయ్యాయి. 

14.ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ఫిర్యాదు

Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కృష్ణానది యజమాని బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదన పై లేఖలో అభ్యంతరం తెలిపారు. 

15.తెలంగాణలో కరోనా ఉధృతి

  తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 552 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

16.భూ సమస్యలపై 15 నుంచి రెవెన్యూ సదస్సులు

Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

తెలంగాణలో భూ సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. 

17.గౌతమ్ రాజు మృతి పై పవన్ కళ్యాణ్ స్పందన

Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు మృతి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన గౌతమ్ రాజు మృతి పట్ల విచారణ వ్యక్తం చేశారు. 

18.హైదరాబాదులో ఎన్ఐఏ సోదాలు

Telugu Apcm, Bonalu Delhi, Cm Kcr, Corona, Cpi Yana, Goutam Raju, Kishan Reddy,

హైదరాబాదులో జాతీయ దర్యాప్తు సంస్థ సోదరులు చేయడం కలకలం రేపింది.పాతబస్తీ సంతోష్ నగర్ ప్రాంతంలో మనోహర్ హుస్సేన్ అనే వ్యక్తి ఎన్ ఐ ఏ బృందం అదుపులోకి తీసుకుంది. 

19.పెగాసస్ పై ముగిసిన హౌస్ కమిటీ సమావేశం

  పెగాసిస్ హౌస్ కమిటీ సమావేశం ముగిసింది హోం ఐటీ శాఖల నుంచి హౌస్ కమిటీ సమాచారం సేకరించింది.ఈ క్రమంలో డేటా చౌర్యం జరిగిందని కమిటీ నిర్ధారణకు వచ్చింది. 

20.మావోయిస్టు ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు హైకోర్టులో విచారణ

  మావోయిస్టు ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు పై హైకోర్టులో విచారణ జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube