కర్నూలు నగర పాలక సంస్థ సుపరింటెండెంట్ ఇంజనీరు కే.సురేంద్ర బాబు 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
అమృత్ పథకం కింద కాంట్రాక్టర్ శ్రీనివాసులు రెడ్డి చేసిన పనులకు బిల్లు మంజూరు చెయ్యడానికి ఇంజనీరు 15 లక్షల రూపాయలు డిమాండ్ చెయ్యడంతో భాదితుడు ఏసీబీ అధికారులను అశ్రయించాడు.
ఈరోజు ఉదయం కర్నూలు లోని కృష్ణనగర్ ఉపరితల వంతెన వద్ద డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
కోటి 52 లక్షల రూపాయల బిల్లు మంజూరు కోసం 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని ఏసీబీ డిఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపారు.