అవును, ఇది నిజంగా మోర్గాన్ అభిమానులకు చేదు వార్తగానే పరిగణించాలి.అతగాడు ఎలాంటి అతగాడు అనేది ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు.
ఇంగ్లండ్‌కు వన్డే వరల్డ్ కప్ అందించిన వాడుగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ పేరిట ఓ భారీ రికార్డు వుంది.త్వరలో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.
ఒకప్పుడు తన ఆట తీరుతో అందరిని మెప్పించిన మోర్గాన్ ఈమధ్యకాలంలో ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నాడు.ఈ క్రమంలో మోర్గాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఒకింత బాధాకరమైన వార్తగానే చెప్పుకోవాలి.
ఇతని ప్లేసులో ఎవరు రాబోతున్నది ఇపుడు ప్రశ్నర్ధకంగా మారింది.మోర్గాన్ స్థానంలో.ప్రస్తుత వైస్‌కెప్టెన్‌గా ఉన్న జోస్ బట్లర్ ఇంగ్లిష్ జట్టు పరిమిత ఓవర్ల సారథిగా నియమితుడయ్యే అవకాశముందని సమాచారం.35 ఏళ్ల ఇయాన్.తన నాయకత్వంలో పరిమిత ఓవర్లలో ఇంగ్లండ్‌ను తిరుగులేని జట్టుగా తీర్చిదిద్దాడు.అయితే 2019లో జట్టు వన్డే ప్రపంచ కప్ గెలిచాక కెప్టెన్‌గా మోర్గాన్ ఒక సెంచరీ మాత్రమే చేయడం ఒకింత బాధాకర విషయమే.
ఈ విషయంలో కొన్ని విమర్శలు కూడా మూటకట్టుకున్నాడు.ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ ఇయాన్ పూర్తిగా విఫలమయ్యాడు.రెండు మ్యాచ్‌ల్లో ఖాతాకూడా తెరవలేకపోయిన అతడు గాయంతో మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు.

ఇంగ్లండ్ తదుపరి సారథిగా బట్లర్ ఎంపికయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి.ఈసారి IPLలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.లీగ్‌లో రాజస్థాన్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక భూమిక పోషించాడు.
ఆ జోరు ను నెదర్లాండ్స్‌పై వన్డే సిరీస్ మ్యాచ్ లో కూడా కొనసాగించాడు.తొలిమ్యాచ్‌లో బట్లర్ అజేయంగా 162 (70 బంతులు) రన్స్ చేయడం విశేషత సంతరించుకుంది.
భారత్‌తో మూడేసి టీ20లు, వన్డేల హై ప్రొఫైల్ సిరీస్ కెప్టెన్‌గా బట్లర్‌కు మొదటిది కానుంది.