ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.కన్నడ స్టార్ హీరో దర్శన్ తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేశారు.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్‌యూవీ కారును దర్శన్ కొనుగోలు చేయడం గమనార్హం.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ కారును కలిగి ఉండగా దర్శన్ కూడా ఈ జాబితాలో చేరారు.
హీరో దర్శన్ దగ్గర ఇప్పటికే పలు లగ్జరీ కార్లు ఉన్నాయి.
హ్యూరాకాన్, లంబోర్ఘిని ఉరుస్ కార్లను దర్శన్ కలిగి ఉన్నారు.
ఇప్పటికే ఖరీదైన కార్లను కలిగి ఉన్న హీరో తన కార్ల జాబితాలో మరో కారును చేర్చారు.తమ ఫేవరెట్ హీరో కొత్త కారును కొనుగోలు చేయడంతో అభిమానులు దర్శన్ కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కన్నడ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా దర్శన్ సత్తా చాటుతున్నారు.దర్శన్ చిన్న సినిమాలతో కెరీర్ ను మొదలుపెట్టారు.
ఈ సినిమాలు సక్సెస్ సాధించడంతో దర్శన్ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.మజెస్టిక్ అనే సినిమాతో దర్శన్ లీడ్ రోల్ లో కెరీర్ మొదలైంది.2002 సంవత్సరంలో రిలీజైన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకుంది.ఆ తర్వాత దర్శన్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
దర్శన్ తన నటనతో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ ను అందుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో దర్శన్ ఒకరు కావడం గమనార్హం.పలు సినిమాల్లో దర్శన్ నటనకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి.దర్శన్ కొత్త కారు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సినిమాసినిమాకు దర్శన్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.