ఏదైనా ఫంక్షన్‌కో, పెళ్లికో లేదా పార్టీకో వెళ్లే ముందు ముఖం డల్‌గా, నిర్జీవంగా ఉంటే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.అసలు బయటకు వెళ్లాలన్న మూడు, ఉత్సహాం.
రెండు ఆవిరి అయిపోతుంటాయి.అయితే అలాంటి సమయంలో చాలా సింపుల్‌గా మరియు వేగంగా ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేషియల్ చేసుకుంటే క్షణాల్లో మీ ముఖం గ్లోయింగ్‌గా, ఎట్రాక్టివ్‌గా మారుతుంది.మరి లేటెందుకు ఏదైనా పంక్షన్‌కి వెళ్లే ముందు ఈజీగా ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
స్టెప్-1:
ముందుగా చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి.అందుకోసం ఒక బౌల్‌లో ఐదారు స్పూన్ల పచ్చి పాలు, రెండు టేబుల్ స్పూన్ల పుదీనా జ్యూస్, చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసుకుని కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దూది సాయంతో ముఖానికి, మెడకు రుద్ది.
ఆపై తడి క్లాత్‌తో తుడుచుకోవాలి.తద్వారా చర్మానికి పట్టి ఉన్న దుమ్ము, ధూళి, జిడ్డు పోతాయి.
స్టెప్-2:
క్లెన్సింగ్ తర్వాత చర్మాన్ని స్క్రబ్ చేసుకోవాలి.అందుకోసం ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, మూడు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.రెండు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.
స్టెప్-3:
ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ కీర జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు, నెక్‌కు అప్లై చేసుకుని.స్మూత్‌గా పది నిమిషాలైనా మసాజ్ చేసుకోవాలి.ఆపై తడి క్లాత్‌తో తుడుచుకోవాలి.
స్టెప్-4:
ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి, వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం, నాలుగు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుని.ముఖానికి పూతలా వేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం ఫేస్ వాష్ చేసుకుంటే ఫేషియల్ పూర్తైనట్లే.ఏదైనా ఫంక్షన్ కి వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా ఫేషియల్ చేసుకుంటే ముఖం అందంగా, ఆకర్షణీయంగా మారుతుంది.