సాయి పల్లవి లేకపోతే విరాటపర్వం లేదు: వేణు ఊడుగుల

వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన ప్రేమ కావ్యం జోడించి దర్శకుడు వేణు ఈ సినిమాని ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

 Without Sai Pallavi There Is No Virataparvam Venu Udugula , Venu Udugula, Tollyw-TeluguStop.com

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి అన్ని ప్రాంతాలలో పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో రామానాయుడు స్టూడియోలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ వేణు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ విరాటపర్వం సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అన్ని ప్రాంతాల నుంచి మంచి టాక్ వచ్చింది.

ఈ సినిమా ఇంత మంచి విజయం కావడానికి కారణమైన నిర్మాతలుచెరుకూరి సుధాకర్ రావు, సురేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు.

Telugu Sai Pallavi, Tollywood, Venu Udugula, Virataparvam-Movie

ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉందని ముఖ్యంగా ఈ సినిమాకు సాయి పల్లవి పాత్ర ఎంతో కీలకంగా మారిందని తెలిపారు.సాయి పల్లవి లేకపోతే విరాటపర్వం సినిమా లేదు అంత అద్భుతంగా నటించారు అంటూ డైరెక్టర్ సాయి పల్లవి నటన పై ప్రశంసలు కురిపించారు.ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube