సాయి పల్లవి లేకపోతే విరాటపర్వం లేదు: వేణు ఊడుగుల

వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు అద్భుతమైన ప్రేమ కావ్యం జోడించి దర్శకుడు వేణు ఈ సినిమాని ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి అన్ని ప్రాంతాలలో పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో రామానాయుడు స్టూడియోలో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ వేణు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ విరాటపర్వం సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అన్ని ప్రాంతాల నుంచి మంచి టాక్ వచ్చింది.

ఈ సినిమా ఇంత మంచి విజయం కావడానికి కారణమైన నిర్మాతలుచెరుకూరి సుధాకర్ రావు, సురేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు.

"""/" / ఇక ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉందని ముఖ్యంగా ఈ సినిమాకు సాయి పల్లవి పాత్ర ఎంతో కీలకంగా మారిందని తెలిపారు.

సాయి పల్లవి లేకపోతే విరాటపర్వం సినిమా లేదు అంత అద్భుతంగా నటించారు అంటూ డైరెక్టర్ సాయి పల్లవి నటన పై ప్రశంసలు కురిపించారు.

ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నా కాపురంలో హన్సిక చిచ్చు పెట్టింది.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!