పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ సోషల్ మీడియాలో పలు చమత్కారమైన ట్వీట్లు చేస్తుంటారు.కొన్ని ఆలోచింపజేసే ట్వీట్లు కూడా నెటిజన్లతో పంచుకుంటారు.
తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది.తన తాజా పోస్ట్‌లో కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ స్టార్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ చిత్రీకరించిన గోడపై గ్రాఫిటీ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
స్క్వార్జెనెగర్ బాడీని ప్రదర్శిస్తుంది.ఇక ఆర్నాల్డ్ ప్రొఫెషనల్ బాడీబిల్డర్.
ఏడు మిస్టర్ ఒలింపియాలను గెలుచుకున్నాడు.అతడి ఫొటోను గోడపై అభిమానులు వేసి, దాని కింద రాసిన క్యాప్షన్ నవ్వులు పూయిస్తోంది.
దానినే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
ఇంగ్లిష్‌లో కొన్ని పదాలు పలకడానికి చాలా మంది కష్టపడుతుంటారు.ఎంత భాషా పండితులైనా కొన్ని పదాలను పలికేటప్పుడు ఇబ్బంది ఎదురవుతుంది.ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అని పలకడం కూడా కొంచెం క్లిష్టతరమే.దీంతో బెంగుళూరులో ఓ చోట ఆర్నాల్డ్ శివాజీనగర్ అని రాసి ఉంది.
స్క్వార్జెనెగర్ అని పలకడానికి చాలా మందికి కష్టమై, ఇలా సింపుల్‌గా శివాజీనగర్ అని చేసేశారు.దీనినే ఆనంద్ మహీంద్రా వాల్ ఆర్ట్‌ను ‘ది గ్రేట్ ఇండియన్ ఫన్నెల్’ అని ట్యాగ్ చేస్తూ, ట్విట్టర్‌లో పెట్టారు.
స్క్వార్జెనెగర్ అని పలకడానికి ఇబ్బంది పడి శివాజీనగర్ చేసేశారని పేర్కొన్నారు.దీంతో నెటిజన్లు ఆ ఫొటో చూసి నవ్వుకుంటున్నారు.
జూన్ 16న అప్‌లోడ్ చేయబడినప్పటి నుండి, ఫోటోకు 11,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.పాశ్చాత్య స్టార్‌లను అనేక ఫన్నీ భారతీయ పేర్లతో నెటిజన్లు కామెంట్లు చేశారు.