'పోయే ఏనుగు పోయే' ట్రైలర్ విడుదల

పీకేన్ బ్యానర్ పై కె ఎస్ నాయక్ దర్శకత్వంలో మాష్టర్ శశాంత్ మరో ఇద్దరు చిన్నారులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా పోవనమ్మళ్ కేషవన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘పోయే ఏనుగు పోయే’. ఏనుగు కీలక పాత్రలో పోషిస్తున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్ లో ముఖ్య అతిథి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్నకుమార్ విడుదల చేసారు.

 Poye Enugu Poye Trailer Launch Details, Poye Enugu Poye Movie, Poye Enugu Poye T-TeluguStop.com

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… అప్పుల్లో అడవి రాజా, అడవి రాముడు చిత్రాల్లో ఏనుగులు ప్రధాన పాత్ర పోషించి ఘనవిజయం సాధించిన విషయం విదితమే.అలాగే చిన్నారులకు సంబందించిన చిత్రాలు సైతం మంచి విజయాన్ని అందుకున్న సంగతీ తెలిసిందే.

అదే తరహాలో చాలా కాలం తరువాత మళ్ళీ ఇప్పుడు ఏనుగు మరియు చిన్నారుల నేపథ్యంతో సినిమా రావడం ఆనందంగా ఉంది.దానికి పోయే ఏనుగు పోయే అనే విభిన్నమైన టైటిల్ పెట్టి ఆకర్షింపచేయడం అనేది మరో ముఖ్య విషయం.

ఇలాంటి తరహా సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ట్రైలర్ చాలా బాగుంది ప్రేక్షకులను తప్పక ఆకర్షిస్తుందీ చిత్రం.ఇక నిర్మాతల విషయానికి వస్తే వీరిది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టారు.మంచి సందేశాత్మక చిత్రం కనుక తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు అటువంటి వీరికి ఈ పోయే ఏనుగు పోయే చిత్రం ఘన విజయం సాధించి మంచి పేరు సంపాదించు కుంటారని ఆశిస్తున్నాను అన్నారు.

నిర్మాత పవనమ్మాళ్ కేశవన్ మాట్లాడుతూ.విలన్ కు ఒక నిధి మ్యాప్ దొరుకుతుంది ఆ నిధి దక్కాలంటే ఒక ఏనుగు పిల్లను బలివాలని ఒక మంత్రగాడు చెబుతాడు దాంతో విలన్ అందుకోసం ఒక ఏనుగుల వేటగాడిని కలిసి ఆ ఏనుగును బలివ్వాలని అనుకుంటాడు.

విషయం తెలిసిన ఆ ఏనుగు వేటగాడి కుమారుడు వారి ప్లాన్ ను తప్పించి ఏనుగును ఎలాగైనా కాపాడాలని ప్రయత్నిస్తాడు.

Telugu Childrens, Chitram Srinu, Ks Naik, Master Sushanth, Poye Enugu Poye, Poye

అదే ఈ చిత్ర కథాంశం.ఇందులో బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు ముఖ్యపాత్ర లు పోషించనున్నారు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.కో ప్రొడ్యూసర్ లత, మాస్టర్ శశాంత్, గురువా రెడ్డి, రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మాస్టర్ శశాంత్, బాహుబలి ప్రభాకర్, రఘుబాబు, చిత్రం శీను, తమిళ ఫేమ్ మనోబాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: అశోక్ రెడ్డి, మ్యూజిక్: భీమ్స్, లిరిక్స్: శ్రీ రాగ్, డాన్స్: రిక్కీ మాస్టర్, డైరెక్టర్: కె ఎస్.నాయక్, కథ- స్క్రీన్ ప్లే: అరవింద్ కేశవన్, నిర్మాత: పవనమ్మాళ్ కేశవన్, కో ప్రొడ్యూసర్: లత.పీఆర్ ఓ: వీరబాబు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube