టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రణీత మొదట ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.ఇకపోతే ఈమె కరోనా సమయంలో ఎవరికీ తెలియ కుండా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.
ఇటీవలే తాను గర్భవతిని అంటూ అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న ప్రణీత తాజాగా మరొక గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది.
ఇటీవల నటి ప్రణీత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.12 జూన్ 10న రాత్రి 8 గంటలకు డెలివరీ అయింది. అయితే ప్రణీతకు డెలవరీ చేసిన డాక్టర్లలో ఆమె తల్లి జయశ్రీ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా తన తల్లి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రణీత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.మా అమ్మ డాక్టర్ జయశ్రీకి ప్రశంసలు.
ఏ అమ్మాయి అయినా తన తల్లి గైనకాలిజిస్ట్ ఉండాలని కోరుకుంటుంది కానీ,గైనకాలిజిస్ట్ అయిన తల్లికి తన కూతురుకు ప్రసవం చేయడం అన్నది అంత సులువైన విషయం కాదని తెలిపింది.
అంతే కాకుండా అది మానసికంగా చాలా కఠినంగా ఉంటుందని, ఎందుకంటే తన కూతురుకు వివిధ సమస్యల గురించి ఆమెకు తెలుసని తనకు మున్నా భాయ్ ఎంబీబీఎస్ సినిమాలోని దృశ్యం గుర్తుకువచ్చిందని ఆ సినిమాలో బోమన్ ఇరానీ తన కుమార్తెకు ఆపరేషన్ చేయాల్సిన సమయంలో తన చేతులు వణికిపోయాయని చెప్పాడు అని తెలిపింది ప్రణీత.థ్యాంక్యూ మమ్మీ నాకు ప్రశాంతమైన అనుభూతిని కలిగించినందుకు.మా అమ్మ ఎలాంటి సమయాల్లో అయినా ఆసుపత్రికి అర్జెంట్ ఎందుకు వెళ్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది.
మా అమ్మ తన వ్యక్తి గత జీవితం, కుటుంబం కంటే వృత్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.ప్రతి పేషంట్ బాధ్యత ఆమె చేతుల్లోనే ఉంటుంది అని నాకు ఇప్పుడు తెలిసింది అంటూ ప్రణీత రాసుకొచ్చింది.