సాధారణంగా రెండేళ్ల చిన్న పిల్లలకు ఏబీసీడీ గుర్తించడం కంటే ఎక్కువ మేధో సామర్థ్యం ఉండదు.మూడేళ్ల వయసులో పిల్లలు సగానికిపైగా ఆల్ఫాబెట్ గుర్తించడంతో పాటు వాటిని పలకగలుగుతారు.
అంతకంటే వారికి ఎక్కువ సామర్థ్యం ఉండదు కానీ ఒక రెండేళ్ల పిల్లాడు మాత్రం ఆల్ఫాబెట్‌లోని 26 అక్షరాలను స్పష్టంగా ప్రొనౌన్స్ చెప్పగలుగుతున్నాడు.అంతేకాదు ఒకే వరుసలో పొల్లు పోకుండా స్పష్టంగా ఏబీసీడీలను చెప్తూ ఆశ్చర్య పరుస్తున్నాడు.
ఏ అంటే యాపిల్ బీ అంటే బ్యాట్ అని ఏబీసీడీలకు అనుబంధ పదాలను కూడా చెబుతున్నాడు.
ఈ టాలెంట్ గమనించిన తల్లిదండ్రులు కూడా అబ్బురపడ్డారు.
అనంతరం తమ బిడ్డ టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేయాలని వారు భావించారు.వెంటనే ఒక వీడియో తీసి హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కి పంపించారు.
దీంతో ఈ సంస్థ పిల్లాడి ప్రతిభను గుర్తించి అతడి పేరును తన బుక్ లో లిఖించింది.అలా ఈ బుడ్డోడు రెండేళ్ళకే హై రేంజ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి ఆశ్చర్య పరుస్తున్నాడు.
ఇంతకీ ఆ బాలుడు ఎవరో తెలుసుకుంటే.బాపట్ల జిల్లా వేటపాలేంలో శివాన్ష్ నాగ ఆదిత్య తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు.

ఇతడిలో ఏ టూ జెడ్ వరకు ఆంగ్ల అక్షరాలు ఉచ్ఛరించే టాలెంట్ ఉంది.అనుబంధ ఆంగ్ల పదాలు కూడా అనర్గళంగా చెప్పగలడు.తల్లిదండ్రులు కసుమర్తి శ్రీనివాస్, సరిత తమ బిడ్డ ఆదిత్య ప్రతిభకు సంబంధించిన వీడియోని ఫిబ్రవరి 2021లో హైరేంజ్ రికార్డ్స్ కి పంపించారు.కాగా ఇప్పుడు ఆ బుడ్డోడికి హైరేంజ్ రికార్డ్స్ సంస్థ ఒక సర్టిఫికెట్‌ను స్పందించింది.
ఈ సందర్భంగా బాలుడిని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మెచ్చుకున్నారు.