క్రాక్ డైరక్టర్ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో 107వ సినిమా చేస్తున్న నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ సినిమా సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడితో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.బాలకృష్ణ 108వ సినిమాకు సంబందించిన అప్డేట్ రేపు అనగా జూన్ 10 బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా రాబోతుందని తెలుస్తుంది.
అయితే తన ప్రతి సినిమా ముహుర్తం రోజే టైటిల్ చెప్పడం అనీల్ రావిపుడికి అలవాటే.అలానే శుక్రవారం నాడు బాలకృష్ణ 108వ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారట.
ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటి అంటే తెలుస్తున్న సమాచారం ప్రకారం బ్రో ఐ డోంట్ కేర్ అని ఫిక్స్ చేశారట.అఫీషియల్ కన్ ఫర్మేషన్ రావాల్సి ఉంది.
ఈమధ్య యువ హీరోలకు ధీటుగా బాలయ్య సినిమాలు చేస్తున్నారు.మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అదిరిపోయే కంటెంట్ తో వస్తున్నారు.
ఈ క్రమంలోనే అనీల్ రావిపుడితో బ్రో ఐ డోంట్ కేర్ అనేస్తారని టాక్.ఇదే కాదు 107వ సినిమా టైటిల్ కూడా శుక్రవారం డిక్లేర్ చేయనున్నారు.
అఖండతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బాలయ్య బాబు రాబోయే రెండు సినిమాలతో కూడా హిట్ టార్గెట్ పెట్టుకున్నారు.