అమెరికా చట్టసభ : 223 – 204 ఓట్లతో నెగ్గిన గన్ కల్చర్ వ్యతిరేక బిల్లు...కానీ....

అగ్ర రాజ్యం అమెరికాలో పెరిగిపోతున్న విచ్చలవిడి గన్ కల్చర్ కు త్వరలో చెక్ పడనుందని, గన్ కల్చర్ కు వ్యతిరేకంగా బిడెన్ ప్రభుత్వం చట్టసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా అత్యధిక ఓట్లు గన్ కు వ్యతిరేకంగా నమోదు అయ్యాయని తెలుస్తోంది.అయితే ఈ బిల్లుకు అనుకూలంగా ఓట్లు పడినంత మాత్రాన ఎలాంటి అడ్డుకట్ట వేయలేమని అంటున్నారు నిపుణులు.

 Us Legislature Anti-gun Culture Bill Won By 223 - 204 Votes But , Us Legislatur-TeluguStop.com

చట్ట సభలో ప్రవేశపెట్టినా ఈ బిల్లు ఎందుకు వీగిపోతుంది.కారణం ఏంటి…ఈ బిల్లులో ఎలాంటి విషయాలను పొందుపరిచారు అనే వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో వ్యక్తిగత స్వేచ్చ చాలా ఎక్కువ, గన్ కల్చర్ విషయంలో ముందునుంచీ అవలంభిస్తున్న తీరు కారణంగానే నేడు అమెరికాలో తుపాకుల తూటాలకు ఏటా వేలాది మంది బలై పోతున్నారు.వ్యక్తిగత స్వేచ్చే అక్కడి ప్రజల కొంప ముంచుతోంది.

ఈ పరిస్థితిపై చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా స్పందించిన బిడెన్ ప్రభుత్వం తుపాకీ నియంత్రణ చట్టాన్ని అమలు లోకి తీసుకువచ్చింది.తాజాగా.

చట్టసభలో ప్రవేశపెట్టిన ఈ వ్యతిరేక బిల్లును 223 – 204 ఓట్లతో చట్ట సభ్యులు మద్దతు తెలిపారు.ఈ వ్యతిరేక బిల్లు ప్రకారం సెమీ ఆటోమేటిక్ తుపాకుల కొనుగోలు చేసే వారికి కనీస వయసు ఉండాలని అలాగే 15 రౌండ్స్ కంటే ఎక్కువ సామర్ధ్యం ఉన్న మందుగుండు సామాగ్రిని విక్రయించడానికి వీలు లేదని బిల్లులో రూపొందించారు.

అయితే ఈ బిల్లు చట్టంగా మారే అవకాశాలు లేవని అంటున్నారు కొందరు నిపుణులు ఎందుకంటే గతంలోనే సెనేట్ మానసిక ఆరోగ్య కార్యక్రమాలను, పాటశాల భద్రత మెరుగు పరచడం, బ్యాక్ గ్రౌండ్ తనిఖీలు మెరుగు పరచడం వంటి విషయాలపై సుదీర్ఘమైన చర్చలు చేస్తోంది.ఈ కారణంతోనే ఈ బిల్లు చట్ట రూపం దాల్చక పోవచ్చనని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube