ఆడపిల్ల పుట్టిందని మెట్టినింటోళ్ల దారుణం

మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తూ ముందుకు వెళ్తుంటే కొందరు మాత్రం ఇంకా మూఢనమ్మకాల నుండి బయటకు రాలేకపోతున్నారు.ముఖ్యంగా ఆడపిల్లల గురించి ఇంకా చిన్నచూపు కొనసాగుతూనే ఉంది.

 Mettinilla Atrocity That The Girl Was Born, Girl, Birth, Viral Latest, News Vira-TeluguStop.com

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో భర్త, అత్తింటివాళ్లు అత్యంత దారుణంగా ఆ మహిళపై దాడి చేసి.

పశువును బాదినట్లు బాదారు.కళ్ళలో పెట్టుకుని చూసుకోవాల్సిన వారే ప్రత్యక్ష నరకం చూపించారు.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.

సాధారణంగా పుట్టబోయే బిడ్డ ఆడో మడో నిర్ణయించేది మగవాళ్లలోని క్రోమోజోములే.కానీ మన సమాజం ఇంకా మూఢనమ్మకాలతో తల్లులను కాల్చుకుతింటోంది.

ఆడపిల్లలను కంటున్న కోడళ్లపై అత్తింటోళ్ల దుర్మార్గాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది.రెండోసారీ ఆడపిల్లకే జన్మించినందుకు ఓ మహిళపై భర్త, అత్తింటివాళ్లు అత్యంత దారుణంగా దాడి చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ ఘోరం జరిగింది.

కూలిపని చేసుకుంటున్న బాధిత మహిళపై అత్తింటివాళ్లు మొదటి కాన్పులో మెగా బిడ్డను కనలేదని కొన్ని నెలలుగా దూషిస్తున్నారు.

తిండి కూడా పెట్టకుండా నిత్యం హింసిస్తున్నారు.అయితే బాధితురాలు ‘రెండోసారి కూడా ఆడపిల్లకు జన్మనివ్వడంతో అత్తారింటి వేధింపులు మరింత పెరిగాయి.

ఈ సారి ఏకంగా ఆడపిల్లకు జన్మనిచ్చిందని నడివీధిలోకి ఈడ్చుకొచ్చి పశువును బాదినట్లు బాదారు.కొట్టొద్దని కాళ్లా వేళ్లా పడినా వినిపించుకోలేదు.

మగబిడ్డను ఎందుకు కనలేదని కొడుతున్నారు’ అని బాధితురాలు వాపోయింది.దాడిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.

అది కాస్త పోలీసుల దృష్టికి వచ్చింది.వెంటనే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.

బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube