టీడీపీ జనసేన పొత్తు : బాబు కి ఇంట్రెస్ట్ తగ్గిందా ? 

టిడిపి అధినేత చంద్రబాబు పొత్తుల విషయంలో మొన్నటి వరకు ఒక రకమైన అభిప్రాయంతో ఉండేవరు .ముఖ్యంగా జనసేన పార్టీ తమతో కలిసి వస్తే ఏపీలో అధికారం సాధించడం కష్టమేమీ కాదు అన్న అభిప్రాయం ఉండేది .

 Chandrababu Took A Key Decision Regarding The Alliance With The Janasena Party T-TeluguStop.com

అందుకే అనేక రకాలుగా ఒప్పించేందుకు, జనసేన తో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు.దీనిపై అనేక సార్లు ప్రకటనలు కూడా పరోక్షంగా చేశారు.

అయితే ఈ విషయంలో జనసేన పార్టీ సరైన క్లారిటీ ఇవ్వలేకపోతోంది.ఎన్నికల సమయం నాటికి ఈ పొత్తుపై తమ నిర్ణయాన్ని ప్రకటించాలని వేచి చూస్తూ ఉండగా బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పేసింది.

అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహించింది.

        ఈ మహానాడులో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మహానాడు కార్యక్రమం ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో,  పొత్తుల విషయంలో చంద్రబాబు నిర్ణయం మారిపోయిందట.ప్రస్తుతం పొత్తుల కోసం ప్రయత్నాలు చేయడం వారు పెట్టే షరతులు , కీలకమైన నియోజకవర్గాల్లోని సీట్లను పొత్తుల కోసం త్యాగం చేయాల్సి వస్తుందనే అభిప్రాయం, ముఖ్యంగా సీఎం సీటు విషయంలో ఇప్పటి నుంచే ఒత్తిడి మొదలయ్యే అవకాశం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పొత్తులపై ఇప్పుడు ఎవరు మాట్లాడవద్దని,  ఎన్నికల సమయంలోనే దానిపై తగిన నిర్ణయం తీసుకుంటామంటూ చంద్రబాబు మహానాడు వేదిక లోనే క్లారిటీ ఇచ్చేశారు.
   

Telugu Chandrababu, Jagan, Janasena, Janasenani, Tdpjanasena, Tdp Mahanadu-Polit

  పొత్తుల అంశాన్ని పార్టీ శ్రేణులంతా పక్కన పెట్టి 175 నియోజకవర్గాల్లోనూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయం పైనే దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు .ఏపీ లోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి 35 నియోజక వర్గాల్లో పార్టీ ఇన్చార్జిలు లేరు.ప్రస్తుతం వారి నియామకం పైన దృష్టి పెట్టి… మహానాడు ద్వారా వచ్చిన ఉత్సాహాన్ని ఎన్నికల వరకు కొనసాగించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.ఈ నేపథ్యంలోనే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారట.

చంద్రబాబు ఆలోచన ప్రకారం చూసుకుంటే జనసేన కోసం తాము పదేపదే ప్రాకులాడుతున్నట్టు కనిపిస్తున్నామని ,  దీని కారణంగా టీడీపీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని , అందుకే ఇక ఈ పొత్తుల విషయంలో అటు వైపు నుంచి రెస్పాన్స్ వచ్చే వరకు స్పందించకూడదు అనే ఆలోచనలో ఉన్న బాబు ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube